గ్రానైట్‌ రాళ్లు క్యాబిన్‌పై పడటంతో.. ఇద్దరి విషాదం! | - | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ రాళ్లు క్యాబిన్‌పై పడటంతో.. ఇద్దరి విషాదం!

Mar 11 2024 12:20 AM | Updated on Mar 11 2024 3:32 PM

- - Sakshi

రాజిరెడ్డి, ఎస్‌కే షబ్బీర్‌ (ఫైల్)

ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లా వాసులు మృతి

ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఖమ్మంరూరల్‌ మండలానికి చెందిన ఈగ రాజిరెడ్డి (37), మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన షేక్‌ షబ్బీర్‌ (35) కలిసి గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్నారు.

వారం రోజుల కిందట వీరు ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఓ గ్రానైట్‌ క్వారీ నుంచి రాయిని తీసుకుని ఖమ్మం వస్తుండగా మార్గమధ్యలో మూలమలుపు వద్ద లారీ అదుపుతప్పింది. ఈ క్రమంలో గ్రానైట్‌ రాళ్లు క్యాబిన్‌పై పడటంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా షబ్బీర్‌ ఐదేళ్లుగా వరంగల్‌క్రాస్‌ రోడ్డులో కుటుంబంతో నివాసముంటున్నాడు. రాజిరెడ్డి ఖమ్మం నగరంలోని సారధినగర్‌వాసి.

ఇవి చదవండి: భార్యను చంపి.. చెత్త డబ్బాలో పెట్టి

Advertisement
 
Advertisement
Advertisement