నేరాల కట్టడికి సంయుక్త తనిఖీలపై చర్చ
మధిర: రాష్ట్ర సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా కట్టడి చేసేలా తెలంగాణ – ఏపీ రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో విధులు నిర్వర్తించనున్నారు. ఈమేరకు మధిరలో సోమవారం తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులు సమావేశమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో నేరస్తుల కదలికలు, చోరీలు, ఇసుక అక్రమ రవాణా, జూదం తదితర అంశాలపై సమాచార మార్పిడి చేసుకుంటూ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి నేరాలకు పాల్పడే వ్యక్తులపై దృష్టి సారించేలా సమాచారం వేగంగా ఇచ్చిపుచ్చుకోవాలనే అంశంపై చర్చించారు. వైరా, మైలవరం ఏసీపీలు సారంగపాణి, రామచంద్రరావు, మధిర రూరల్, తిరువూరు, మదిర టౌన్, వైరా సీఐలు డి.మధు, గిరిబాబు, దోమల రమేష్, వైవీ.ప్రసాద్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


