శివాజీనగర: కోవిడ్ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యగా అన్ని సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కొనసాగిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి యూ.టీ.ఖాదర్ తెలిపారు. టెస్టులు పెరగడం వల్ల కేసుల సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉంది, సోకిన వారందరూ కోలుకుంటున్నారు, ఏ మరణాలు సంభవించలేదు అని తెలిపారు. రాష్ట్రంలో అంటువ్యాధుల నియంత్రణ గురించి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య అత్యవసర కార్యాచరణ వ్యవస్థను అమలులోకి తీసుకువచ్చామని, వ్యాధుల భయంపై జిల్లాలకు సత్వర సమాచారం మార్పిడి జరుగుతుందన్నారు. కోవిడ్, ఆఫ్రికా ఎబోలా గురించి ఆందోళన వద్దని మంత్రి తెలిపారు. ఆఫ్రికన్ ప్రయాణికులను విమానాశ్రయంలోనే ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రజలు వేడి నీరు తాగాలి
ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులతో కూడిన అంటువ్యాధుల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి సీజన్‌లో అంటువ్యాధులు రావడం సహజం, వాటిని నివారించలేం, కానీ నియంత్రించవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి జ్వరం త్వరగా వస్తుంది. ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు ఉచిత ఔషధాలు, ప్రజలు వేడినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలని మంత్రి వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ దఫా రాష్ట్రంలో మలేరియా కేసులు 70 శాతం, డెంగ్యూ కేసులు 33 శాతం తగ్గాయి. చికున్‌గున్యా వ్యాప్తి నివారణకు తగిన చర్యలు తీసుకున్నారు అని చెప్పారు. ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు , ఫార్మసిస్టుల ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు అంటువ్యాధుల చికిత్స పేరుతో, పిల్లల వైద్యం పేరుతో భారీగా బిల్లులు వసూలు చేస్తున్నాయి, ఇలా చేయకూడదని మంత్రి చెప్పారు. ప్రవేట్ ఆసుపత్రులతో చేరిన రోగుల సమాచారాన్ని ఆరోగ్య శాఖకు అందిస్తూ ఉండాలని తెలిపారు.
ఆరోగ్య మంత్రి ఖాదర్


