అత్త ఇంటికి అల్లుడు నిప్పు | - | Sakshi
Sakshi News home page

అత్త ఇంటికి అల్లుడు నిప్పు

Sep 26 2024 1:16 AM | Updated on Sep 26 2024 8:39 AM

-

మైసూరు: భార్యను తన వెంట పంపించడం లేదనే కోపంతో అత్త ఇంటికి నిప్పు పెట్టాడో అల్లుడు. ఈ సంఘటన తాలూకాలోని అరసనకెరె గ్రామంలో జరిగింది. మంగళగౌరి అనే యువతికి టీ.కాటూరు నివాసి శ్రీనివాస్‌తో వివాహమైంది. పూల వ్యాపారం సాగించే శ్రీనివాస్‌ భార్యతో గొడవ పడడంతో ఆమె పుట్టినింటికి వెళ్లిపోయింది. అత్తమామలే తన భార్యను పంపించడం లేదని పగ పెంచుకున్నాడు. అత్త ఇంటికి వెళ్లి తలుపు సందులో నుంచి పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఇంటిలో మంటలు వ్యాపించి అక్కడ ఉన్న సుమారు రూ.20 వేల విలువ చేసే వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనపై జయపుర పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement