రాయచూరు రూరల్: జీవితంలో అజ్ఞానాంధకారం తొలగించి వెలుగు మార్గం చూపే గురుదేవులను స్మరిస్తూ బుధవారం రాష్ట్రమంతటా గురుపౌర్ణమి పుణ్యదినాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. వినాయక, వేదవ్యాస, దత్తాత్రేయ, రాఘవేంద్ర, షిరిడి సాయి ఆలయాల్లో విశేష పూజా వేడుకలు జరిగాయి. మంత్రాలయం మఠం భక్త జనంతో కిక్కిరిసిపోయింది. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థస్వామి బృందావనానికి, మూలవిరాట్టుకు, తులసి చెట్టుకు ప్రత్యేక పూజలుచేశారు. వేలాదిగా భక్తజనం తరలివచ్చారు. రాయల దర్శనం చేసుకోవడానికి ఆరేడు గంటల సమయం పట్టింది.
సిలికాన్ సిటీలో ఘనంగా పూజలు
బనశంకరి: బెంగళూరు జేపీ నగర 6వ ఫేజ్‌లోని శ్రీసత్యగణపతి ఆలయ ప్రాంగణంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ మహోత్సవం, సత్యనారాయణపూజలు జరిగాయి. ఆలయ అధ్యక్షుడు మోహన్‌రాజు, కమిటి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. నగరంలోని పలు మందిరాలలో గురుపూర్ణిమ పూజలు ఆచరించారు. కుద్రోళి గోకర్ణనాథ ఆలయంలో సామూహిక తులసి పూజా నిర్వహించారు. ఆలయాలకు తండోపతండాలకు భక్తజనం తరలివచ్చారు. బెంగళూరు గాంధీనగరలోని మహాబోధి సొసైటీలో బౌద్ధ మతగురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
బెంగళూరులోని ఓ మందిరంలో భక్తజనం
బెంగళూరు మహాబోధి సొసైటీలో బౌద్ధ గురువుల ప్రార్థనలు
బెంగళూరులో పూజలు
మంత్రాలయంలో..
రాష్ట్రమంతటా ఆలయాలలో గురుపూర్ణిమ విశేష వేడుకలు
మంత్రాలయం మఠంలో భక్త సాగరం


