​​​​​​​రివర్స్‌ గేర్‌లో 75 కి.మీ.లు | - | Sakshi
Sakshi News home page

​​​​​​​రివర్స్‌ గేర్‌లో 75 కి.మీ.లు

Sep 5 2023 1:32 AM | Updated on Sep 5 2023 11:17 AM

ట్రాక్టర్‌పై రివర్స్‌లో వెళుతున్న భక్తుడు - Sakshi

ట్రాక్టర్‌పై రివర్స్‌లో వెళుతున్న భక్తుడు

కర్ణాటక: ట్రాక్టర్‌ను రివర్స్‌లో నడుపుతూ ఓ యువకుడు తమ ఇలవేల్పు యల్లమ్మ దేవికి మొక్కుబడి తీర్చుకున్నాడు. హుబ్లీ తాలూకా మంటూరు గ్రామానికి చెందిన బాబుగౌడ(22) అనే ఈ భక్తుడు గత కొన్నేళ్లుగా ట్రాక్టర్‌ నడుపుతున్నాడు. అయితే రివర్స్‌ గేర్‌లో ఇలా 75 కి.మీ. వెళ్లడం ఇదే మొదటిసారి అని, కోర్కె తీరడంతో మొక్కు తీర్చానన్నాడు. ఆ మేరకు ఉదయం 6.15 గంటలకు మంటూరు వలంబేశ్వర దేవస్థానం నుంచి రివర్స్‌ గేర్‌లో బయల్దేరాడు.

కుసుగల్‌, బ్యాహట్టి, తిర్లాపుర, అళగవాడి, హంచనాళ, తిక్కుంబి, హిరేకుంబి, ఉగరగోళ, సౌదత్తికి వెళ్లి అక్కడి నుంచి యల్లమ్మన గుడ్డను మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకొన్నాడు. మొత్తం 75 కి.మీ.ల దూరాన్ని 7.30 గంటల్లో ప్రయాణించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement