బళ్లారిఅర్బన్: కన్నడ భాష, నాడు నుడి, నేల, జల పరిరక్షణ కోసం పోరాటాలు సాగిస్తున్న కర్ణాటక రక్షణ వేదిక(కరవే) శివరామేగౌడ వర్గంలోకి చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకా నాయకనహట్టి పట్టణ నాయకులు చేరారు. బళ్లారి నగరంలోని పార్వతీనగర్‌లో ఉన్న సంఘం కేంద్ర కార్యాలయంలో బళ్లారి, విజయనగర జిల్లాల అధ్యక్షుడు కురట్టి రాజన్న ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకనహట్టి శాఖ నూతన అధ్యక్షుడు జీసీ ఓంకారప్ప, గౌరవాధ్యక్షుడు ముద్దురాజ్, ప్రధాన కార్యదర్శి ఎన్.సురేష్, ఉపాధ్యక్షుడు కాటయ్య, కార్మిక విభాగం అధ్యక్షుడు తిప్పేస్వామి తదితరులు చేరారు. జిల్లా సంఘం కార్యదర్శి కటిగె సూరి, ఉపాధ్యక్షుడు మారెణ్ణ, గౌరవాధ్యక్షుడు బసవరాజ్, కమ్మరచేడు అక్కి శివణ్ణ, జిల్లా కార్యదర్శి జడెగౌడ, దుర్గేష్, హులిగేష్, రాజు, సోము, ఉమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


