బళ్లారిఅర్బన్: గాంధీ భవన్‌లో మంగళవారం నిర్వహించిన తాలూకా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, స్టూడియో యజమానుల అసోసియేషన్(ఆర్‌ఐ) అధ్యక్ష ఎన్నికల్లో ఖాదర్ బాషా మొత్తం 121 ఓట్లతో విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి ఎస్.కె.శివరాం, బి.శ్రీధర్, టీ.ఖాదర్ బాషా పోటీ పడ్డారు. మొత్తం 370 ఓట్లకు గాను 282 ఓట్లు పోలయ్యాయి. వీటిలో ఖాదర్ బాషాకు 121, శివరాంకు 85, శ్రీధర్‌కు 78 ఓట్లు లభించాయి. నోటాకు 2 ఓట్లు పడగా, ఒక ఓటు చెల్లలేదు. తన సమీప ప్రత్యర్థి శివరాంపై 36 ఓట్ల ఆధిక్యంతో ఖాదర్ బాషా గెలుపొందారు. విజయం అనంతరం ఖాదర్ బాషాను ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభినందించారు. చందు, రవిరెడ్డి, ఎంసీఎన్ రెడ్డి, ఫిరోజ్, రఫిక్, చోటు, దాదు, నజీర్, దుర్గన్న, తాయన్న, దుర్గేష్, బి.గోపాల్, కే.వీరేశ్, రఘు, చంద్ర, చంద్రమోహన్, జమీర్, రాజా తదితరులు పాల్గొన్నారు.


