హొసపేటె: రాష్ట్రంలో నిత్యావసర వస్తువులతో పాటు బస్సు ప్రయాణ చార్జీలు పెంచడంపై జేడీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని మంగళవారం బసవేశ్వర సర్కిల్ వద్ద తాలూకా జేడీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘం అధ్యక్షులు వై.మల్లికార్జున మాట్లాడుతూ ఇప్పటికే కరువు పరిస్థితులతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పాలు, పెరుగు, నెయ్యి వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద, తరగతి కుటుంబాలపై మరింత భారం మోపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జేడీఎస్ నాయకులు కృష్ణమూర్తి శెట్రు, పాండు నాయక్, హోటల్ సిద్దరాజు, గోమాత కొట్రేష్, మంజునాథ్, గవిసిద్దయ్య, బడిగేర్ బసవరాజ్, మైనహళ్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


