రాయచూరు రూరల్ : విద్యార్థుల ప్రతిభకు ప్రదర్శనలు తార్కాణం కావాలని ఎంపీ కుమార నాయక్ పేర్కొన్నారు. మంగళవారం మహర్షి వాల్మీకి రాయచూరు విశ్వవిద్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి, విచార ధారల గురించి మాట్లాడారు. సమాజంలో సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. స్వార్థం వీడి నిస్వార్థంతో పని చేయాలన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉత్తమ విద్యకు అవకాశాలుంటాయిన్నారు. స్వశక్తితో ఉన్నత విద్యనభ్యసించాలన్నారు. మహర్షి వాల్మీకి ఆదర్శాలను అలవర్చుకోవాలన్నారు. వైస్ చాన్సలర్ శివానంద, చెన్నప్ప, విరుపాక్షయ్య, లత, వెంకటేష్‌లున్నారు.


