అవగాహన కల్పిస్తున్నాం
మంథనిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో అపరిశుభ్రత నెలకొంటే వ్యాధులు ప్రబలుతాయని ముందస్తు చర్యలు చేపట్టేవారు. ఇందుకోసం గతంలో మధ్యాహ్న భోజన సమయంలో హ్యాండ్‌వాష్ చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకునేవారు. దీనికోసం ప్రతీపాఠశాలలో ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అనేక పాఠశాలల్లో హ్యాండ్‌వాష్ ప్లాట్‌ఫామ్స్ కానరాకపోగా నల్లాలు నిరుపయోగంగా మారాయి.
నిరుపయోగంగా ప్లాట్‌ఫామ్‌లు
పెద్దపల్లి జిల్లాలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులు పరిశుభ్రత పాటించేలా హ్యాండ్‌వాష్ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేసి నల్లాలు అమర్చారు. గతేడాది వసతుల కల్పనపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పిల్లలు చేతులు శుభ్రం చేసుకునేలా నల్లాలను ఏర్పాటు చేసింది. నిర్వహణ లోపంతో చెత్త, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి.
చేతులు శుభ్రం చేసుకునేలా..
విద్యార్థులకు శుభ్రతపై అవగాహన కల్పించేలా గత ప్రభుత్వం పాఠశాలల్లో హ్యాండ్‌వాష్ ప్రవేశపెట్టింది. మధ్యాహ్న భోజన సమయంలో ప్రతీవిద్యార్థి చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. హ్యాండ్‌వాష్ నల్లాలు లేని పాఠశాలల్లో బకెట్లలో నీళ్లు పెట్టి చేతులు శుభ్రం చేయించేవారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పించేవారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా అనేక పాఠశాలల్లో హ్యాండ్‌వాష్ కానరావడం లేదు.
విద్యార్థుల ఆరోగ్యంపై..
సీజనల్ వ్యాధులు ప్రబలే వర్షాకాలంలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ చూ పించాల్సి ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు భోజనం చేసే ముందు చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలి. అలాగే వ్యాధులబారిన ప డుకుండా ముందస్తు జాగ్రత్తల గురించి వివరించా ల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నా ఇప్పటివరకు విద్యార్థుల పరిశుభ్రతపై ఎవరూ శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. మధ్యాహ్న భోజన సమయంలో చేతులు శుభ్రం చేసుకునేలా చూస్తున్నా. కొన్ని పాఠశాలల్లో ప్రత్యేకంగా చేతులు శుభ్రం చేసుకునేలా ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఎక్కడైనా ప్లాట్‌ఫామ్‌లు వినియోగంలో లేకపోతే ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటాం.
– దాసరి లక్ష్మి, మండల విద్యాధికారి, మంథని
సర్కార్ బడుల్లో కానరాని పరిశుభ్రత
నిరుపయోగంగా హ్యాండ్‌వాష్ ప్లాట్‌ఫామ్‌లు
విద్యార్థుల ఆరోగ్యంపై అవగాహన కరువు
శ్రద్ధ చూపాలంటున్న తల్లిదండ్రులు


