జ్యోతినగర్: ఎన్టీపీసీ జెడ్పీహెచ్‌ఎస్ 1989–90 పదోతరగతి బ్యాచ్ విద్యార్థులు దాదాపు 36 ఏళ్లతర్వాత ఒకచోటుకు చేరుకుని జ్ఞాపకాలను పంచుకున్నారు. హెచ్‌ఎం జయరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా తమ పాఠశాల, గురువులను మరువకుండా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని హెచ్‌ఎం పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆటలు, పాటలు, సరదాలు, శిక్షలు అన్నీ గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి బెంచీలు, టీచర్ల మాటలు, లంచ్ బాక్స్‌లు ఇప్పటికీ కళ్ల ముందు కదులుతున్నాయని అని ఒకసారి గుర్తుచేసుకున్నారు.
సామాజిక సేవకు శ్రీకారం
పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా గడియారం బహూకరించారు. పదో తరగతిలో 500 మార్కులకుపైగా సాధించిన ఐదుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు (క్యాష్ అవార్డులు)అందజేశారు. కార్యక్రమంలో రాజ్‌కుమార్, రాంబాబు, సమ్మిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌రావు, ప్రహ్లాద్‌రావు, శ్రీనివాసు, లలిత కుమారి, అనుపమ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
దాదాపు 36 సంవత్సరాల తర్వాత అందరం ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉంది. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని స్నేహితులతో సంతోషంగా గడిపాం.
– మేరుగు సరస్వతి,
వెంకట్రావుపేట, మంచిర్యాల జిల్లా
36 ఏళ్ల తర్వాత కలిసిన ఆత్మీయులు
ఆకట్టుకున్న ఎన్టీపీసీ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం


