‘జ్యోతిష్మతి’ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

‘జ్యోతిష్మతి’ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

Jul 14 2026 12:12 AM | Updated on Jul 14 2026 12:12 AM

విద్యార్థులకు చెక్కులు అందజేస్తున్న కళాశాల చైర్మన్‌ జువ్వాడి సాగర్‌రావు,

తిమ్మాపూర్‌: జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌(అటానమస్‌) కళాశాల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కళాశాలలో బీటెక్‌లో చేరిన ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఏటా రూ.18 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. దానిని అమలు చేయడం సోమవారం నుంచి ప్రారంభించింది. లలితాపూర్‌ గ్రామానికి చెందిన నల్లెంగి మేఘన, కరీంనగర్‌కు చెందిన సఫూరా షర్మిన్‌ సీఎస్‌ఈ విభాగంలో చేరారు. ఒక్కొక్కరికి రూ.18వేల స్కాలర్‌షిప్‌ చెక్కులు అందుకున్నారు. జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్‌ జువ్వాడి సాగర్‌రావు, షాలిని ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ తరఫున విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ చెక్కులను అందజేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ఏటా రూ.18 వేల చొప్పున నాలుగేళ్లు రూ.72 వేలు స్కాలర్‌షిప్‌ అందజేయనున్నట్లు వివరించారు. కళాశాల సెక్రటరీ జువ్వాడి సుమిత్‌ సాయి, ప్రిన్సిపాల్‌ అధ్యాపకులు పాల్గొన్నారు.

బీటెక్‌లో చేరిన విద్యార్థులకు ఏటా రూ.18 వేలు

నాలుగేళ్లలో రూ.72 వేల లబ్ధి

సద్వినియోగం చేసుకోవాలంటున్న కళాశాల యాజమాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement