'బండి సంజయ్‌' నామినేషన్‌ సందర్భంగా.. భారీ ర్యాలీ! | - | Sakshi
Sakshi News home page

'బండి సంజయ్‌' నామినేషన్‌ సందర్భంగా.. భారీ ర్యాలీ!

Nov 6 2023 1:06 AM | Updated on Nov 6 2023 9:53 AM

- - Sakshi

సాక్షి, కరీంనగర్‌: భారతీయ జనతాపార్టీ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ సోమవారం నామినేషన్‌ వేయనున్నారు. ఈ నామినేషన్‌ కార్యక్రమానికి బీజేపీ సీనియర్‌ నేత ప్రకాశ్‌జవదేకర్‌, గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అతిథులుగా హాజరుకానున్నారు. నామినేషన్‌ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న బైక్‌ ర్యాలీ కమాన్‌చౌరస్తా, వెంకటేశ్వర టెంపుల్‌, రాజీవ్‌ చౌక్‌, కోర్టు చౌరస్తా, శివటాకీస్‌, జ్యోతి నగర్‌, రాంనగర్‌, గీతాభవన్‌ చౌరస్తా వరకు సాగనుంది. అక్కడి నుంచి పాదయాత్ర ర్యాలీ ద్వారా సంజయ్‌ కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.
ఇవి చదవండి: 'నామినేషన్లకు' ఎప్పుడెలా ఉందో.. కాస్త చూసి చెప్పండి! పురోహితుల వెంట..

Advertisement
 
Advertisement
Advertisement