● కొండ ముచ్చు వేషధారణలో విద్యార్థి
భిక్కనూరు: కోతుల బెడద నివారణకు భిక్కనూరు మండలంలో ఒక విద్యార్థి కొండ ముచ్చు ముసుగు ధరించి వీధుల్లో సంచరిస్తున్నారు. దీంతో కోతులు బెంబెలెత్తి పారిపోతున్నారు. మండల కేంద్రానికి చెందిన అంబల్ల ఆగ్నేష్ అనే ఇంటర్ విద్యార్థి నగరేశ్వరాలయం సమీపంలో తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇళ్లలో చొరబడి ఆహారాన్ని పారపోయడం కోతులు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో ప్రతిరోజు కోతులు హంగామా చేస్తున్నాయి. ఇది గమనించిన ఆగ్నేష్ కోతుల బెడద నివారణకు ఉపాయం ఆలోచించాడు. దీంతో ఆన్‌లైన్‌లో కొండ ముచ్చు ముఖ ముసుగును కొనుగోలు చేశాడు. ఐదు రోజులుగా ప్రతి రోజు కళాశాలకు వెళ్లే ముందు, సాయంత్రం కళాశాల నుంచి వచ్చిన తర్వాత ఒక గంట పాటు కొండు ముచ్చు ముఖ ముసుగును ధరించి ఆ ప్రాంతంలోని నాలుగు ఐదు వీధుల్లో తిరుగుతున్నాడు. దీంతో కోతుల బెడద కొంతమేర తగ్గింది.


