అనుమానాస్పద స్థితిలో ఎకై ్సజ్ ఉద్యోగి మృతి
కామారెడ్డి రూరల్: ఎకై ్సజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పో లీసులు తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని కల్కినగర్‌లో నివాసం ఉంటున్న మామిడి అనిల్ కుమార్(41) దోమకొండ ఎకై ్సజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తన ఇంట్లో తీవ్ర అనారోగ్యానికి అతన్ని కుటుంబీకులు 108 అంబులెన్సులో జీజీహెచ్‌కు తరలించాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనిల్‌కు భార్య నీరజ, పిల్లలు శాన్వి, జాహ్నవి, రిషిత్ ఉన్నారు. తల్లి ఇందిర ఫిర్యా దు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే బ్రాహ్మణపల్లి బాలయ్య సతీమణి బాలగంగామణి (82) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2019లో బాలయ్య మృతి చెందారు. వీరికి ఎనిమిది మంది సంతానం కాగా నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు. శనివారం ఉదయం బాలగంగామణి అంతిమయాత్ర కామారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని వారి ఇంటినుంచి నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
గాంధారి: పాము కాటుతో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని ముదెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రవి కుమార్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒల్లెపు శ్రీనివాస్(27) భార్య తల్లిగారింటికి వెళ్లగా గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్నాడు. నిద్రలో ఉండగానే పాము కాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ప్రత్యూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
పిట్లం: హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు జాతీయ రహదారి గుండా అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల రేషన్ బియ్యాన్ని శుక్రవారం పట్టుకున్నట్లు పిట్లం పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నామని అన్నారు. 632 పాలిథిన్ కవర్లలో ఉన్న రేషన్ బియ్యాన్ని(30 టన్నులు) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డ్రైవర్లు పర్బత్ కరంటా దేవరాజ్, శరద్ ఆబా బచ్‌కర్, ఓనర్ ఇబ్రహీం పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


