జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు జరగాలి. రింగ్‌రోడ్లు, బ్రిడ్జీలు, రోడ్లు, డ్రెయినేజీ, ట్రాఫిక్ వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులు రావాలి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాలి. ఇలాంటి మార్పులు, సౌకర్యాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. –నవ్యశ్రీ, డిగ్రీ విద్యార్థిని
ఘనంగా హన్మంత్ సింధే బర్త్‌డే
నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధేకు గురువారం జుక్కల్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. డోన్‌గావ్ గ్రామంలోని తన ఇంట్లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఆనంతరం జుక్కల్ చౌరస్తా నుంచి మద్నూర్ మైథిలి ఫంక్షన్ హాల్ వరకు బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ కాన్వాయ్‌తో ర్యాలీ తీశారు. కార్యకర్తలు రక్తదానం చేశారు. హన్మంత్‌సింధేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, బాన్సువాడ బీఆర్‌ఎస్ నేత మురెల్లి శ్రీనివాస్, సొసైటీల చైర్మన్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జన్మదిన వేడుకల్లో... జేబు దొంగలు
మైథిలి ఫంక్షన్ హాల్‌లో హన్మంత్‌సింధే జన్మదిన వేడుకలో జేబు దొంగలు హల్ చల్ చేశారు. పెద్దకొడప్‌గల్, మహమ్మద్ నగర్ మండలాలకు చెందిన ఇద్దరు బీఆర్‌ఎస్ కార్యకర్తల జేబులను కత్తిరించి రూ. 26,800 చోరీ చేశారు.


