సదాశివనగర్: మండలంలోని ధర్మారావ్‌పేట్ ఎల్లమ్మ ఆలయంలో జరిగిన చోరీ ఘటనను సదాశివనగర్ పోలీసులు శుక్రవారం ఛేదించారు. ఆలయంలో చోరీ జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధర్మారావ్‌పేట్‌కు చెందిన తొగరి శ్రీనివాస్, తొగరి మల్లేశ్వరీలను నిందితులుగా గుర్తించారు. ఈ నెల 8న ఇద్దరు కలిసి గ్రామంలోని ఆలయానికి వెళ్లి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అమ్మవారి మెడలో ఉన్న బంగారు ముక్కుపోగులను దొంగిలించారు. వీరు బంగారు ముక్కు పోగులను కామారెడ్డిలో విక్రయించడానికి శుక్రవారం బైక్‌పై వెళ్తుండగా మర్కల్ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకొని విచారణ చేపట్టారు. ఆలయంలో చోరీ చేసింది తామేనంటు నిందితులు నేరం ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. ఎస్సై పుష్పరాజ్, పోలీస్ సిబ్బంది అజర్ ఫారూఖ్, నరేశ్, ఇసాక్, ప్రభు ఉన్నారు.


