● రెండు కార్లు ఢీ.. ఏడుగురికి గాయాలు
కామారెడ్డి రూరల్: కామారెడ్డి హైవే పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఓ కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న మరో కారు ఢీకొన్నది. రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడవి తండాకు చెందిన పరశురాములు, దేవిదాస్, రాజేశ్, బాలాజీ, మరో కారులో ప్రయాణిస్తున్న రోహిణి తండాకు చెందిన ప్రతిభ, చిన్నారులు శివాన్సీ, రియాన్సీలు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


