సదాశివనగర్: యువత సన్మార్గంలో నడవాలని ఆర్‌ఎస్‌ఎస్ ఇందూర్ విభాగ్ ప్రముఖ్ ముత్యం సూచించారు. గురువారం మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన యువ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. 15–35 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 237 మంది కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువకులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారి ఆశయాలను నెరవేర్చాలన్నారు, యువత మత్తు పదార్థాలను, మాదకద్రవ్యాలకు బానిస కావొద్దన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ మండలాధ్యక్షుడు కొప్పుల నర్సారెడ్డి, వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు.


