● అచ్చంపేట ప్రభుత్వ ప్రాథమిక
పాఠశాలకు పూర్వ విద్యార్థి చేయూత
● మారిన బడి రూపురేఖలు
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి చేయూతనిచ్చాడు. అచ్చంపేట గ్రామానికి చెందిన సైమన్ సదరు పాఠశాలలో 2006 సంవత్సరంలో 5వ తరగతి పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంటిరియర్ డిజైనర్‌గా, రాయల్ కలర్ మెన్‌గా పనిచేస్తున్నాడు. పాఠశాల తరగతి గదులకు రంగులు దిద్దడంతో పాటు అక్షరాల నామాలు, చిత్రాలను గోడలపై దిద్దాడు. వేల రూపాయల ఖర్చుతో కూడిన రంగులు స్వయంగా తన చేతులతో కుంచె వేశాడు. పండుగలు, శుభకార్యాల కోసం గ్రామానికి వచ్చినప్పుడల్లా సైమాన్ ప్రభుత్వ పాఠశాలల స్థితి గతులను చూసి చలించాడు. దీనికి తోడు సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాల్ సింగ్ పాఠశాల అభ్యున్నతికి కోసం దాతల సహయాన్ని కోరాడు. పాఠశాల అభ్యున్నతికి కోసం సైమన్ ముందుకు వచ్చాడు. పాఠశాల తరగతి గదులకు సొంత డబ్బులతో పేయింటింగ్ స్వయంగా వేశాడు. తరగతి గదులు రంగుల మయంగా మారడంతో పాఠశాల రూపు రేఖలు మారాయి. సైమన్ సేవలను స్ఫూర్తిగా తీసుకున్న గ్రామస్తులు దాతలుగా పాఠశాలకు సహాయం చేస్తున్నారు. సదరు పాఠశాలలకు ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, ఎల్‌ఈడీ టీవీని విరాళంగా అందజేశారు. పాఠశాల ఆవరణలో గదికి షెడ్డు ఏర్పాటు చేయించారు.


