విద్యార్థులకు పుస్తకాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

Aug 14 2026 7:26 AM | Updated on Aug 14 2026 7:26 AM

బీర్కూర్‌లో విద్యార్థులకు నోటు పుస్తకాలు

అందజేస్తున్న ప్రిన్సిపల్‌ మోహన్‌రెడ్డి

గాంధారిలో విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ చేస్తున్న ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం

గాంధారి: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నోట్‌బుక్స్‌ను జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.కళాశాల ప్రిన్సిపల్‌ సింగం శ్రీనివాస్‌, అధ్యాపకులు రాజగోపాల్‌, లక్ష్మణ్‌, శ్రీధర్‌, విజయకుమార్‌, రమేష్‌, సంబాజి, సరిత, సుజాత, స్వప్న, మమత, మల్లయ్య, తేజ, సిబ్బంది గణేష్‌, ఆరిఫ్‌, రాములు, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడ/బీబీపేట/సదాశివనగర్‌/లింగంపేట : బీర్కూర్‌, బీబీపేట, లింగంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రిన్సిపల్స్‌ మోహన్‌రెడ్డి, శంకర్‌, నరేందర్‌ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులకు డిజిటల్‌ తరగతులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement