బాన్సువాడ రూరల్: తాడ్కోల్‌లో సీ్త్రశిశు సంక్షేమశాఖ, మహిళాసాధికారిత కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి గ్రామ పంచాయతీ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సౌభాగ్య, మహిళా సాధికారిత కేంద్రం సభ్యులు తులసీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, అంగన్‌వాడీ టీచర్ భారతి, అన్వరి, ఆశవర్కర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
పిట్లం: పారేడ్‌పల్లి గ్రామంలో గురువారం రైతులకు ఎఫ్‌ఎఫ్‌ఎస్ (ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సెల్) యాప్‌పై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తర్ణ అధికారి సురేశ్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులను యాప్‌లో బుక్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: పొలం పట్టా పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతు ఆధార్‌కార్డుకు మొబైల్ నంబర్ లింక్ ఉండాలని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ అన్నారు. గురువారం ఆయన కాద్లాపూర్‌లో రైతులకు ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్‌పై గ్రామ పంచాయతీలో అవగాహన కల్పించారు. సర్పంచ్ శీతల్ అంకూష్, ఉప సర్పంచ్ ఫత్రుసాబ్, రైతులు గడిగె గణేష్, శంకర్, మనోజ్, రామదాసు, హస్సన్ తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట(భిక్కనూరు): రాజంపేట పీహెచ్‌సీలో గురువారం అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యురాలు విజయ మహాలక్ష్మి గర్భిణులకు పరీక్షలు నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.వైద్యురాలు సంగీత, ఎంపీహెచ్‌ఈవో మంజూర్, ల్యాబ్ టెక్నిషియన్ ఉన్నారు.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
గాంధారి: చెల్లితో గొడవ కావడంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని గడ్డిమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గాంధారి మండలం గుజ్జుల్ తండాలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన జర్పుల దివ్య మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. చెల్లెలితో గొడవపడి ఇంట్లో ఉన్న గడ్డిమందు సేవించగా కుటుంబసభ్యులు గమనించి కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని అన్ని పాఠశాలల హెడ్ మాస్టర్లు, పీడీ, పీఈటీలు చొరవ తీసుకుని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల, జోనల్, జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించాలని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీధర్ ఒక ప్రకటనలో కోరారు. ఆయా మండలాల ఎంఈవోలు ఈనెల 15 వరకు మండల సమావేశాలు ఏర్పాటు చేసి మండల, జోనల్ స్థాయి క్రీడలు నిర్వహించాలన్నారు. ఆగస్టు మూడవ వారం లోగా మండల స్థాయి క్రీడలు నిర్వహించి జోనల్ క్రీడలు నిర్వహించాలని, సెప్టెంబర్ 2వ వారంలోగా జోనల్ క్రీడల అనంతరం జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేసి సెప్టెంబర్ 4వ వారంలోగా ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడలు నిర్వ హించాల్సి ఉంటుందన్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ పీజీ రెండోఏడాది 4వ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నట్టు వైస్ ప్రిన్సిపల్, పరీక్షల నియంత్రణ అధికారి కే.కిష్టయ్య తెలిపారు.


