కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణానికి చెందిన టౌన్ బిల్డర్ (చిగులపల్లి) శ్రీనివాస్–కిరణ్మయి దంపతులు గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.లక్షా 51 వేలు విరాళంగా అందజేశారు. పోటీ పరీక్షలకు సిద్ధ మౌతున్న నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులకు ఉపయుక్తంగా పుస్తకాలు కొనుగోలు చేయాలని వారు సూచించారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి దాతలను సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


