క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

చికిత్స పొందుతూ యువకుడి మృతి

గాంధారి: అనారోగ్య కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ యువకుడు చికిత్స పొందుతూ చెందినట్లు ఏఎస్సై ప్రకాశ్‌ శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన సోలంకి శంకర్‌రావు(32) అనే యువకుడు అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తి చెంది నెల 5న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి బాపురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు.

బావిలో పడి వృద్ధుడు ..

భిక్కనూరు: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘ టన రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోటి సిద్ధయ్య (83) అనే వృద్ధుడు ఈ నెల 6న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలే దు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. స్థానిక శివాలయం వద్ద ఉన్న పాడుబడ్డ బావిలో మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement