● అదనపు కలెక్టర్ విక్టర్
● ప్రజావాణికి 121 వినతులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ విక్టర్ అధికారుల కు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు వచ్చా యి. వాటిలో భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులు లాంటి ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యా దులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పెండింగ్ లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో పాండు, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రైవేటు పాఠశాల బస్సులను అడ్డుకుంటున్నారు ..
గ్రామంలోకి ప్రైవేటు పాఠశాలల బస్సులు రాకుండా స్థానిక నాయకులు కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు సోమవారం ప్రజావాణికి తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం గ్రామంలోని పిల్లలను సర్కారు బడికి పంపాలని గ్రామపంచాయితీ పెద్దలు నిర్ణయించారని తెలిపారు. మొదట్నుంచీ కామారెడ్డిలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటున్న 9,10వ తరగతి పిల్లలకు మాత్రం మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలా ఇవ్వకుండా గ్రామంలోకి వచ్చే ప్రైవేటు పాఠశాలల బస్సులను ఆపడం, డ్రైవర్, క్లీనర్ లను బెదిరించడం చేస్తున్నారని తెలిపారు. ఈవిషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరుగలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.


