● తానాజీ రావు, పెద్దకొడప్‌గల్
తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ పెద్దకొడప్‌గల్ మండలానికి చెందిన బీజేపీ నాయకుడు తానాజీ రావు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రం లోని నూతన ప్లాట్ల కాలనీలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఏడాది క్రితం కాలనీకి నీరందించే పైప్‌లైన్ చెడిపోయిందని తెలిపారు. మిషన్ భగీరధ నీరు కూడా రావడం లేదన్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లా అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


