జీపీ భవనం నిర్మాణానికి భూమి విరాళం | - | Sakshi
Sakshi News home page

జీపీ భవనం నిర్మాణానికి భూమి విరాళం

Jul 21 2026 1:24 AM | Updated on Jul 21 2026 1:24 AM

నస్రుల్లాబాద్‌: మండలంలోని నూతనంగా ఏర్పడిన సంగం(ఏ) గ్రామ పంచాయతి భవనం నిర్మాణానికి గ్రామస్తుడు బంజె పరమేశమప్ప భూమిని విరాళం అందించినట్లు సర్పంచ్‌ తరుణ్‌ తెలిపారు. సోమవారం గ్రామ పెద్దల సమక్షంలో మూడు గుంటల భూమిని ఇస్తూ తీర్మానం చేశారు. ఈసందర్భంగా గ్రామ పెద్దలు ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు పెద్దకాపు కిషన్‌, సాయిలు, శ్రీనివాస్‌, కాశీనాథ్‌, గ్రామస్తులు ఉన్నారు.

బీరప్ప ఆలయానికి స్థలం కేటాయింపు

పిట్లం(జుక్కల్‌): మండల కేంద్రం ఎల్లమ్మ కుచ్చలో బారడి పోచమ్మ ఆలయం వెనక భాగంలో సోమవారం బీరప్ప ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బీరప్ప ఆలయానికి స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరారని తెలిపారు. అడ్వకేట్‌ రామ్‌ రెడ్డి, మోహన్‌ రెడ్డి, కుర్మ,గొల్ల సంఘ సభ్యులు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement