బస్సుకోసం విద్యార్థుల రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

బస్సుకోసం విద్యార్థుల రాస్తారోకో

Jul 21 2026 1:24 AM | Updated on Jul 21 2026 1:24 AM

కామారెడ్డి రూరల్‌ : కామారెడ్డి మండలం లింగాయిపల్లి, కొటాల్‌పల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆర్టీసీ బస్సులను తమ స్టేజీల వద్ద ఆపడం లేదని సోమవారం కామారెడ్డి – రాజంపేట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ప్రతిరోజూ ఉదయం పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే సమయంలో బస్సులు ఆపకపోవడంతో ఆలస్యమవుతోందని, చదువుకు ఆటంకం కలుగుతోందని విద్యార్థులు తెలిపారు. రాజంపేట మండలం వరకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. పలుమార్లు అధికారులకు, ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బస్సుల ను నిలిపేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు విద్యార్థులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement