పిట్లం(జుక్కల్): పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బాన్సువాడ నుంచి సంగారెడ్డి అంగడికి పశువులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు పిట్లం మండలం చిన్నకొడప్‌గల్ గ్రామం వద్ద సోమవారం ఉదయం ట్రాలీ ఆటోను పట్టుకున్నామన్నారు. చిన్నపాటి వాహనంలో తొమ్మిది పశువులను ఇరుకు ఇరుకుగా పెట్టి రవాణా చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. దీంతో డ్రైవర్ సంతోష్, వాహన యజమాని పోల్కంపల్లి శేఖర్, పశువులను తరలిస్తున్న మహమ్మద్ మునీర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


