సదాశివనగర్(ఎల్లారెడ్డి) : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి విక్రమ్ సూచించారు. మంగళవారం మండలంలోని తిమ్మోజివాడి, తుక్కోజివాడి గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘ఫుడ్ సేప్టీ ఆన్ వీల్స్’ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు...పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నభోజనం, పౌష్టికాహారం అందిస్తున్న తీరును పరిశీలించారు. సర్పంచ్ భవాని, ఉప సర్పంచ్ రవీందర్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


