ఎర్రాపహాడ్‌లో ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఎర్రాపహాడ్‌లో ఒకరి ఆత్మహత్య

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎర్రాపహాడ్‌ గ్రామంలోఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెంది న చిట్యాల చిన్న మైశయ్య(45)అనే వ్యక్తి నాలుగు సంవత్సరాలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించిన కడుపు నొప్పి తగ్గలేదు. దీంతో కడుపునొప్పి బాధ భరించలేక సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మృతుడికి భార్య బాలమణి, ఒక కూతురు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేర కు మంగళవారం కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement