వనమహోత్సవంలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

వనమహోత్సవంలో భాగస్వాములు కావాలి

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

కామారెడ్డి రూరల్‌: ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా ప్రొహిబిషన్‌–ఎకై ్సజ్‌ అధికారి ముకుంద్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఈతమొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముకుంద్‌రెడ్డి హాజరై మొక్కలు నాటి మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. రాష్ట్రంలో ఈత చెట్ల పెంపకం గౌడ కుల వృత్తిదారుల జీవనోపాధికి ఎంతో ఉపయోగకరమన్నారు. ఏఈఎస్‌ అరుణ్‌ చంద్ర, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌ కృష్ణ, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు విక్రమ్‌ కుమార్‌, శ్రీనివాసరావు, ఏపీవో అన్నపూర్ణ, గ్రామ సర్పంచ్‌ భీమయ్యల లక్ష్మీ రాజు, ఉప సర్పంచ్‌ స్వప్న లక్ష్మీ నారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మీ రాజా గౌడ్‌, గౌడ సంఘం అధ్యక్షుడు ధర్మగోని కిషన్‌ గౌడ్‌, గౌడ సంఘం సభ్యులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement