మాచారెడ్డి: మండలంలోని కాకులగుట్ట తండా వద్ద 25 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్ద రు మిత్రులు అప్పుడే మృతిచెందగా తీవ్రంగా గా యపడిన మూడో మిత్రుడు మంగళవారం వేకువజామున మృతిచెందాడు. వివరాలు ఇలా.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన అనిల్(22), అన్వేష్ (22), వికాస్(22) అ నే ముగ్గురు స్నేహితులు జూన్ 26న కారులో కామారెడ్డి నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. కాకులగుట్ట తండా వద్ద వారి కారు ప్రమాదవశాత్తు రోడ్డు పక్క న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఒక రోజు వ్యవధిలో అన్వేష్ మృత్యువాత పడ్డాడు. అప్పటి నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వికాస్ చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమించి మృతిచెందాడు.
25 రోజుల క్రితం కారులో వెళ్లిన ముగ్గురు మిత్రులు
కాకులగుట్ట తండా వద్ద చెట్టుకు ఢీ
ఘటన జరిగిన రెండు రోజుల్లోనే ఇద్దరు మిత్రులు మృత్యువాత


