నేడు దోహాలో చర్చలు  | Trump claims Iran has agreed to hold peace talks in Doha | Sakshi
Sakshi News home page

నేడు దోహాలో చర్చలు 

Jun 30 2026 5:12 AM | Updated on Jun 30 2026 5:12 AM

Trump claims Iran has agreed to hold peace talks in Doha

ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 

ధ్రువీకరించని ఇరాన్‌ 6 బిలియన్‌ డాలర్ల 

ఇరాన్‌ నగదు నిల్వలను విడుదల చేయనున్న ఖతర్‌

దుబాయ్‌: ఇరాన్‌పై ఓవైపు దాడులు చేస్తూ మరోవైపు చర్చలకు సిద్ధపడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘దాడులకు తట్టుకోలేక మాతో సమావేశానికి ఇరాన్‌ సిద్ధపడింది. అందుకే మంగళవారం ఇరాన్‌ ప్రతినిధి బృందంతో సమావేశంకాబోతున్నాం. ఖతర్‌ రాజధాని నగరం దోహాలో ఈ సమావేశం జరగనుంది’’అని ట్రంప్‌ ప్రకటించారు. 

హార్మూజ్‌లో విదేశీ చమురునౌకపై ఇరాన్‌ దాడిచేసిందని ప్రతిగా ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణి స్థావరాలపై అమెరికా దాడిచేయడం, ఇందుకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడటంతో మళ్లీ పరస్పర దాడులు మొదలయ్యాయని పశి్చమాసియాలో ప్రబలిన భయాందోళనల మధ్య తదుపరి దశ చర్చలున్నాయంటూ ట్రంప్‌ సోమవారం ప్రకటన చేయడం గమనార్హం. అయితే ట్రంప్‌ ప్రకటనకు భిన్నంగా ఇరాన్‌ స్పందించింది. మంగళవారం చర్చల కోసం ఎలాంటి షెడ్యూల్‌ లేదు అని ఇరాన్‌ సీనియర్‌ మధ్యవర్తి కాజెమ్‌ ఘరిబాబాడీ స్పష్టంచేశారు.

 మరోవైపు చర్చల ప్రతిపాదనల్లో పేర్కొన్న ప్రకారం ఖతర్‌ తమకు చెందిన గతంలో స్తంభింపజేసిన 6 బిలియన్‌ కోట్ల డాలర్ల ఆస్తులను త్వరలో విడిపించనుందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ సోమవారంప్రకటించారు. హార్మూజ్‌ జలసంధిపై తమకు ఇంకా పట్టు ఉందని, ఒప్పందానికి ఇరాన్‌ ప్రజల మద్దతు ఉందని తెలియజేసేందుకే పెజెష్కియాన్‌ ఈ ప్రకటన చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మంగళవారం చర్చలు ఉంటాయని ఈ అంశంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న పాకిస్తాన్‌ సోమవారం ప్రకటించింది. సాంకేతిక అంశాలపై మరి కొద్ది రోజుల్లో చర్చలు ప్రారంభమవుతాయని అమెరికా సైతం మరో ప్రకటనలో పేర్కొంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement