
న్యూయార్క్/వాషింగ్టన్: మంచి మిత్రదేశం అంటూనే వివాదాస్పద, అపఖ్యాతి పాల్జేసే జాబితాలో భారత్‌ను అమెరికా చేర్చింది. మాదకద్రవ్యాల కట్ట డిపై ఉక్కుపాదం మోపే భారత్‌ను ప్రధాన డ్రగ్స్ రవాణా, ఉత్పత్తి దేశాల జాబితాలో అమెరికా అధ్య క్షుడు ట్రంప్ చేర్చారు. ఈ మేరకు ‘అధ్యక్షుడి సంకల్పం’ పత్రాన్ని సోమవారం అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్ సమర్పించారు.
భారత్, బహమాస్, బెలీజ్, బొలివియా, బర్మా, చైనా, కొలంబియా, కోస్టారికా, డొమినికా రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, హైతీ, హోండురాస్, జమైకా, లా వోస్, మెక్సికో, నికరాగ్వా, పాకిస్తాన్, పనామా, పె రూ, వెనెజువెలా సహా 23 దేశాలతో జాబితాను సిద్ధంచేసి కాంగ్రెస్‌కు ట్రంప్ సమర్పించారు. ‘‘విదే శాల్లో ఉత్పత్తయి ఈ దేశాల గుండా అమెరికాకు డ్రగ్స్ రావడం, లేదంటే ఈ 23 దేశాలు ఆ జాబితా లో ఉన్నాయి.