బాబా వంగా జోస్యం: వరల్డ్ కప్‌లో గ్రహాంతరవాసుల దాడి? | Baba Vanga's Alien Attack Prediction During World Cup Match Sparks Global Buzz And Online Debate, Read More Details | Sakshi
Sakshi News home page

బాబా వంగా జోస్యం: వరల్డ్ కప్‌లో గ్రహాంతరవాసుల దాడి?

Jun 24 2026 10:16 AM | Updated on Jun 24 2026 11:46 AM

Baba Vangas prophecy of alien invasion at sporting event

బ్రసిలియా: ప్రముఖ అంధ ప్రవక్త బాబా వంగా గతంలో చెప్పిన ఒక జోస్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రచ్చ చేస్తోంది. ఒక పెద్ద క్రీడా ఈవెంట్ జరుగుతున్న సమయంలో గ్రహాంతరవాసులు (ఏలియన్స్) భూమిపై దాడి చేస్తారని బాబా వంగా దశాబ్దాల క్రితమే అంచనా వేశారు. ఇప్పుడు అదే జోస్యాన్ని బలపరుస్తూ బ్రెజిల్‌కు చెందిన ఓ ప్రముఖ స్వయంప్రకటిత భవిష్యవేత్త జూన్ 24న ఫ్లోరిడాలో జరగబోయే ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లోనే ఏలియన్స్ దాడి చేయబోతున్నాయంటూ సంచలన ప్రకటన చేశారు. లైవ్ టెలివిజన్ సాక్షిగా వేలాది మంది అభిమానులు, ఆటగాళ్లు అపహరణకు గురవుతారని ఆమె హెచ్చరించడం సంచలనంగా మారింది.

కలతపెట్టిన కల.. మైదానంలో గ్రహాంతరవాసులు
సోషల్ మీడియాలో 23 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగిన బ్రెజిల్ భవిష్యవేత్త ‘వో బహియానా’ ఈ వింత జోస్యాన్ని వెల్లడించారు. ఈ నెలలో తనకు రెండుసార్లు ఒకే విధమైన భయంకరమైన కల వచ్చిందని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫ్లోరిడాలోని మయామిలో బ్రెజిల్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌ సమయంలో భారీ స్పేస్‌షిప్స్ మైదానంలోకి ప్రవేశిస్తాయని, అవి యాంత్రిక చేతుల లాంటి పరికరాలతో ఆటగాళ్లను, అభిమానులను అపహరిస్తాయని ఆమె పేర్కొన్నారు. తాను స్వయంగా ఆ స్పేస్‌షిప్ లోపల ఉన్నట్లు కలగన్నానని, అక్కడ అంతా ఏడుపులు, ఆర్తనాదాలు, తీవ్ర భయాందోళనలు కనిపించాయని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

రెప్టీలియన్స్ రాక.. సోషల్ మీడియాలో ట్రోల్స్
బహియానా అంచనా ప్రకారం, మొదట వచ్చే మదర్‌షిప్ ఆటగాళ్లను తీసుకెళ్లిన తర్వాత, ‘రెప్టీలియన్స్’ అని పిలిచే మరో రకమైన గ్రహాంతరవాసుల నౌక అక్కడకు వస్తుంది. కుట్ర సిద్ధాంతాల (conspiracy theories) ప్రకారం ఈ రెప్టీలియన్స్ భూమిపై మనుషుల రూపంలోనే జీవిస్తున్నారని నమ్ముతారు. బహియానా ఈ అపహరణలకు సంబంధించిన ఒక ఏఐ వీడియోను కూడా షేర్ చేయడంతో ఇంటర్నెట్‌లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, మెజారిటీ నెటిజన్లు ఈ జోస్యాన్ని కొట్టిపారేస్తూ ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

గత అంచనాలు నిజమయ్యాయా? 
బహియానా అనుచరులు మాత్రం ఆమె మాటలను గట్టిగా నమ్ముతున్నారు. గతంలో బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో వచ్చిన భారీ వరదలను, అలాగే ప్రముఖ సంగీత విద్వాంసులు క్రిస్టియన్, జోనో కార్నీరోల మరణాలను ఆమె ముందుగానే ఊహించారని వారు గుర్తు చేస్తున్నారు. అయితే మ్యాచ్‌పై దాడి జరుగుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: ప్రపంచానికి ‘కిమ్’ సవాల్: అణ్వాయుధాలతో వీరంగం!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement