జూనియర్స్‌.. జిగేల్‌ | Children Shared Their Thoughts Sakshi Happy Juniors Event | Sakshi
Sakshi News home page

జూనియర్స్‌.. జిగేల్‌

Apr 27 2026 11:49 AM | Updated on Apr 27 2026 12:44 PM

Children Shared Their Thoughts Sakshi Happy Juniors Event

ఉత్సాహంగా సాక్షి ‘కిడ్స్‌ హ్యాపీ ఈవినింగ్‌’

ఆకట్టుకున్న జూనియర్‌ జర్నలిస్ట్, రోబోటిక్స్‌ వర్క్‌షాప్‌ 

అపర్ణ సైబర్‌జోన్‌లో చిన్నారుల కోలాహలం

గచ్చిబౌలి/శేరిలింగంపల్లి : ‘సాక్షి’ కిడ్స్‌ హ్యాపీ ఈవినింగ్‌ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. వన్‌ మినెట్‌ టాక్‌లో ప్లాస్టిక్‌–సైలెంట్‌ డెమాన్, మదర్‌ ఎర్త్‌ అండ్‌ పోల్యూషన్‌ ఛాలెంజెస్‌పై చిన్నారులు అనర్గళంగా మాట్లాడి  ఆకట్టుకున్నారు. కాలుష్యం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించారు. రోబోటిక్స్‌ వర్క్‌షాప్‌లతో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు అబ్బురపరిచారు. సాక్షి హ్యాపి కిడ్స్‌ ఈవినింగ్‌లో (Sakshi Happy Kids Evening) భాగంగా సాక్షి జూనియర్‌ జర్నలిస్టు, రోబోటిక్స్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని అపర్ణ సైబర్‌ జోన్‌లో ఆదివారం సాయంత్రం  ఈకార్యక్రమం నిర్వహించారు. 

పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ వినియోగం వల్ల జరిగే నష్టాలు, ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో ఏమేమి నేర్చుకోవచ్చు, ఏఐతో సొంత ఆలోచనలు ఉండవని చెబుతూనే టీచర్లు చెప్పే సమాధానాలు ఎమోషనల్‌గా, విలువలను పెంచే విధంగా ఉంటాయని చిన్నారులు ఆలోచింపజేసేలా మాట్లాడి మంత్రముగ్ధుల్ని చేశారు. 150 మంది చిన్నారులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. వన్‌ మినిట్‌ టాక్‌లో విజేతలుగా నిలిచిన సహేజ  ధవారే, అర్మాన్, శ్రీవిద్య కాత్యాయిని లకు బహుమతులు ప్రదానం చేశారు.

   

భవిష్యత్తు రోబోటిక్స్‌దే ..
మనుషులు చేయాల్సిన పనులన్నీ రానున్న రోజుల్లో రోబోలే చేస్తాయి. రోజు రోజుకూ అన్ని రంగాలలో వాటి పాత్ర పెరుగుతోంది. వాటిని మనం సరిౖయెన దిశలో సది్వనియోగం చేసుకోవాలి. ఇలాంటి వర్క్‌ షాప్‌లు మరింత ఆసక్తిని పెంపొందిస్తాయి. 
– సహేజ ధవారే

ఏఐతో సమస్త సమాచారం   
ఏఐతో విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. అయితే ఏఐతో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి.  ఏఐ అధికంగా వాడితే వ్యసనంగా మారే  ప్రమాదముంది. 
– అర్మాన్‌

కాలుష్యంతో సమస్య... 
గాలి, నీటి కాలుష్యంతో అనేక సమస్యలు ఎదరువుతున్నాయి. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అదే విధంగా ఎలక్ట్రానిక్‌ ఈ–వేస్ట్‌లతో వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ఈ–వేస్ట్‌ను తగ్గించడంతోపాటు రీయూజ్, రీసైకిల్‌ పై అవగాహన కల్పించాలి. 
– శ్రీవిద్య కాత్యాయిని

ప్లాస్టిక్‌తో క్యాన్సర్‌ ప్రమాదం 
ప్లాస్టిక్‌ వాడకంతో శరీరంలో అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు గురువుతున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులు, క్యారీ బ్యాగులను వాడరాదు.  ప్లాస్టిక్‌ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ప్లాస్టిక్‌ కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.  
– సాయి చరణ్, అపర్ణ సైబర్‌జోన్‌  

స్టోరీ బుక్స్‌తో జ్ఞాపకశక్తి పెరుగుతుంది 
విద్యార్థులు స్టోరీ బుక్స్, న్యూస్‌ పేపర్స్‌ చదవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 15 ఏళ్ళలోపు ఉన్న చిన్నారులు ఏ విషయాన్ని చెప్పినా గ్రహిస్తారు. వాళ్లలో పోటీతత్వం నెలకొల్పితే భవిష్యత్తు బాగుంటుంది. చిన్న వయస్సులోనే ఏఐపై చాలా బాగా మాట్లాడారు.  
– శ్రీకాంత్, తెలంగాణ బ్యూరో చీఫ్, సాక్షి 

పిల్లల్లో జర్నలిజంపై ఆసక్తి 
సాక్షి జూనియర్‌ జర్నలిస్టు, రోబోటిక్స్‌ కార్యక్రమం పిల్లల్లో జర్నలిజంపై ఆసక్తి కలిగిస్తుంది.  స్కూల్‌ స్థాయిలోనే జర్నలిజంపై అవగాహన కలి్పంచడం శుభపరిణామం. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలి.   
– సాంబశివరావు, టెలికాం రిటైర్డ్‌ డీజీఎం  

చిన్నారుల్లో ఉత్సాహం
సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంతో చిన్నారుల్లో ఎంతో ఉత్సాహం కలిగించింది. ఇలాంటి కార్యక్రమాలు వీకెండ్‌లలో మరిన్ని నిర్వహించాలి. ముఖ్యంగా ఏఐ, రోబోటిక్‌ జూనియర్‌ జర్నలిస్టు కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.   
– సిద్ధార్థ రెడ్డి, అపర్ణ సైబర్‌ జోన్‌ ‘జే’ బ్లాక్‌  

ఇదో మంచి అవకాశం... 
జూనియర్‌ జర్నలిస్టు కాన్సెప్ట్‌ చాలా బాగుంది. ఒక నిమిషంలో ఒక అంశంపై ఎలా మాట్లాడాలో పిల్లలకు బాగా అర్థం అయ్యింది. ఇలాంటి కార్యక్రమాలు అనర్గళంగా మాట్లాడేందుకు దోహదం చేస్తాయి. విద్యార్థులకు స్టేజ్‌ ఫియర్‌ కూడా పోతుంది.  
– ప్రియా, పునీత్‌ దంపతులు  

Advertisement
 
Advertisement
Advertisement