breaking news
sporting
-
బాబా వంగా జోస్యం: వరల్డ్ కప్‌లో గ్రహాంతరవాసుల దాడి?
బ్రసిలియా: ప్రముఖ అంధ ప్రవక్త బాబా వంగా గతంలో చెప్పిన ఒక జోస్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రచ్చ చేస్తోంది. ఒక పెద్ద క్రీడా ఈవెంట్ జరుగుతున్న సమయంలో గ్రహాంతరవాసులు (ఏలియన్స్) భూమిపై దాడి చేస్తారని బాబా వంగా దశాబ్దాల క్రితమే అంచనా వేశారు. ఇప్పుడు అదే జోస్యాన్ని బలపరుస్తూ బ్రెజిల్‌కు చెందిన ఓ ప్రముఖ స్వయంప్రకటిత భవిష్యవేత్త జూన్ 24న ఫ్లోరిడాలో జరగబోయే ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లోనే ఏలియన్స్ దాడి చేయబోతున్నాయంటూ సంచలన ప్రకటన చేశారు. లైవ్ టెలివిజన్ సాక్షిగా వేలాది మంది అభిమానులు, ఆటగాళ్లు అపహరణకు గురవుతారని ఆమె హెచ్చరించడం సంచలనంగా మారింది.కలతపెట్టిన కల.. మైదానంలో గ్రహాంతరవాసులుసోషల్ మీడియాలో 23 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగిన బ్రెజిల్ భవిష్యవేత్త ‘వో బహియానా’ ఈ వింత జోస్యాన్ని వెల్లడించారు. ఈ నెలలో తనకు రెండుసార్లు ఒకే విధమైన భయంకరమైన కల వచ్చిందని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫ్లోరిడాలోని మయామిలో బ్రెజిల్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ సమయంలో భారీ స్పేస్‌షిప్స్ మైదానంలోకి ప్రవేశిస్తాయని, అవి యాంత్రిక చేతుల లాంటి పరికరాలతో ఆటగాళ్లను, అభిమానులను అపహరిస్తాయని ఆమె పేర్కొన్నారు. తాను స్వయంగా ఆ స్పేస్‌షిప్ లోపల ఉన్నట్లు కలగన్నానని, అక్కడ అంతా ఏడుపులు, ఆర్తనాదాలు, తీవ్ర భయాందోళనలు కనిపించాయని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.రెప్టీలియన్స్ రాక.. సోషల్ మీడియాలో ట్రోల్స్బహియానా అంచనా ప్రకారం, మొదట వచ్చే మదర్షిప్ ఆటగాళ్లను తీసుకెళ్లిన తర్వాత, ‘రెప్టీలియన్స్’ అని పిలిచే మరో రకమైన గ్రహాంతరవాసుల నౌక అక్కడకు వస్తుంది. కుట్ర సిద్ధాంతాల (conspiracy theories) ప్రకారం ఈ రెప్టీలియన్స్ భూమిపై మనుషుల రూపంలోనే జీవిస్తున్నారని నమ్ముతారు. బహియానా ఈ అపహరణలకు సంబంధించిన ఒక ఏఐ వీడియోను కూడా షేర్ చేయడంతో ఇంటర్నెట్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, మెజారిటీ నెటిజన్లు ఈ జోస్యాన్ని కొట్టిపారేస్తూ ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.గత అంచనాలు నిజమయ్యాయా? బహియానా అనుచరులు మాత్రం ఆమె మాటలను గట్టిగా నమ్ముతున్నారు. గతంలో బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో వచ్చిన భారీ వరదలను, అలాగే ప్రముఖ సంగీత విద్వాంసులు క్రిస్టియన్, జోనో కార్నీరోల మరణాలను ఆమె ముందుగానే ఊహించారని వారు గుర్తు చేస్తున్నారు. అయితే మ్యాచ్‌పై దాడి జరుగుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ప్రపంచానికి ‘కిమ్’ సవాల్: అణ్వాయుధాలతో వీరంగం! -
రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ
ముంబై, సాక్షి: స్మార్ట్ ఫోన్స్ కంపెనీ రియల్ మీ.. స్మార్ట్ వాచీలను ప్రవేశపెట్టింది. ఎస్ ప్రో, ఎస్ బ్రాండ్లతో వీటిని విడుదల చేసింది. సర్క్యులర్ డిజైన్‌తోపాటు.. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ ఫీచర్స్‌తో రూపొందించింది. కొంత ప్రీమియం మోడల్ అయిన ఎస్ ప్రో వాచీ ధర రూ. 9,999కాగా.. ఎస్ వాచీ ధర రూ. 4,999. వీటికి మధ్యస్థంగా ఎస్ మాస్టర్ ఎడిషన్ పేరుతో రూ. 5,999 ధరలో మరో మోడల్ వాచీని సైతం ప్రవేశపెట్టింది. వీటిని ఈ నెల 29 నుంచీ రియల్మీ, ఫ్లిప్‌కార్ట్ సైట్లతోపాటు.. స్టోర్లలోనూ విక్రయించనుంది. ఇతర వివరాలు చూద్దాం..(యాపిల్ నుంచి తొలిసారి హెడ్‌ఫోన్స్) ఫీచర్స్.. సింగిల్ బ్లాక్ డయల్ గల ఎస్ ప్రో, ఎస్ వాచీలు.. సిలికాన్ స్ట్రాప్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ కలర్స్‌లో స్ట్రాప్స్ లభించనున్నాయి. వీటితోపాటు.. వేగన్ లెదర్ స్ట్రాప్స్ సైతం బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్స్‌లో లభిస్తాయి. వీటికి రూ. 499-999 అదనంగా చెల్లించవలసి ఉంటుంది. ఎస్ ప్రో వాచీ 1.39 అంగుళాల అమోలెడ్ తెరను కలిగి ఉంటుంది. 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో లభిస్తుంది. లైట్ సెన్సర్ ద్వారా బ్రైట్నెస్లో 5 లెవెల్స్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు. ఏఆర్ఎం కార్టెక్స్ ఎం4 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆధునిక ఆల్వేస్ ఆన్డిస్ప్లే ఫీచర్‌ను ఓటీఏ అప్డేట్ ద్వారా తదుపరి దశలో అందించనుంది. రియల్మీ లింక్ యాప్ ద్వారా 100 వాచ్ ఫేసెస్ అందుబాటులోకి వస్తాయి. ఔట్‌డోర్, ఇన్డోర్ రన్, వాక్, సైక్లింగ్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, యోగా తదితర 15 రకాల స్పోర్ట్స్ మోడ్స్ కలిగి ఉంది. 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌ను వినియోగించడం ద్వారా స్విమ్మింగ్‌లోనూ యూజ్ చేయవచ్చు. రోజంతా హార్ట్‌రేట్ మానిటరింగ్‌తోపాటు.. బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, డ్యూయల్ శాటిలైట్ జీపీఎస్ విధానంతో లభిస్తుంది. 420 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మాగ్నిటిక్ చార్జింగ్ బేస్‌తో రెండు గంటల్లో పూర్తి చార్జింగ్కు వీలుంది. (యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!) ఎస్ మోడల్ ఇలా ఎస్ వాచీ 1.3 అంగుళాల స్క్రీన్‌తో, 390 ఎంఏహెచ్ బ్యాటరీతో రూపొందింది. 2.5డి కర్వ్డ్ గొరిల్లా గ్లాస్3ను అమర్చారు. రన్నింగ్, సైకిల్, ఎలిప్టికల్, ఫుట్‌బాల్, యోగా తదితర 16 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. రియల్ టైమ్ హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్‌కు ఎస్పీవో2 ఫీచర్‌ను కలిగి ఉంది. కనెక్ట్ చేసిన ఫోన్ నుంచి నోటిఫికేషన్స్ అందుకుంటుంది. స్విమ్మింగ్‌కు అనుకూలంకాదు. -
‘ఆర్యన్’గా నేడు ప్రేక్షకుల ముందుకు శివణ్ణ
ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్, నటి రమ్య ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఆర్యన్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, రమ్య అథ్లెట్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు బెంగళూరు నగర పరిసరాల్లోనే జరిగింది. ఇక ఈ సినిమాకు మొదట దర్శకత్వం వహించిన డీ రాజేంద్రబాబు గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన నేపథ్యంలో సినిమా చిత్రీకరణలో మిగిలిన భాగానికి గురుదత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే శాండల్‌వుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో శాండల్‌వుడ్‌లో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.


