‘ఆర్యన్’గా నేడు ప్రేక్షకుల ముందుకు శివణ్ణ | 'Aryanga today ahead of the audience sivanna | Sakshi
Sakshi News home page

‘ఆర్యన్’గా నేడు ప్రేక్షకుల ముందుకు శివణ్ణ

Aug 1 2014 3:29 AM | Updated on Sep 2 2017 11:10 AM

‘ఆర్యన్’గా నేడు ప్రేక్షకుల ముందుకు శివణ్ణ

‘ఆర్యన్’గా నేడు ప్రేక్షకుల ముందుకు శివణ్ణ

ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్, నటి రమ్య ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఆర్యన్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్, నటి రమ్య ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఆర్యన్’ సినిమా  శుక్రవారం  ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రీడా  నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, రమ్య అథ్లెట్‌లుగా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు బెంగళూరు నగర పరిసరాల్లోనే జరిగింది. ఇక ఈ సినిమాకు మొదట దర్శకత్వం వహించిన డీ  రాజేంద్రబాబు గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన నేపథ్యంలో సినిమా చిత్రీకరణలో మిగిలిన భాగానికి గురుదత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే శాండల్‌వుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో శాండల్‌వుడ్‌లో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement