breaking news
Aryan
-
ఢిల్లీ వర్సిటీ ఏబీవీపీదే!
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూని యన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ మద్దతు గల ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్ మాన్ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఏడేళ్ల విరామం తర్వాత గత ఏడాది ఈ స్థానాన్ని గెలుచుకున్న ఎన్ఎస్యూఐ నుంచి అధ్యక్ష పదవిని ఏబీవీపీ చేజిక్కించుకోవడం విశేషం. ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్ మాన్, కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ అభ్యర్థి జోస్లిన్ నందిత చౌదరిపై 16,196 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆర్యన్ మాన్కు 28,841 ఓట్లు రాగా, ఎన్ఎస్యూఐ అభ్యర్థి జోస్లిన్‌కు 12,645 ఓట్లు వచ్చాయి. మొత్తం నాలుగు స్థానాలకు గాను.. ఏబీవీపీ అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను గెలుచుకుంది. అయితే ఉపాధ్యక్ష పదవిని కోల్పోయింది. ఏబీవీపీకి చెందిన కునాల్ చౌదరి, దీపికా ఝా.. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు ఎన్నికయ్యారు, కాగా ఎన్ఎస్యూఐకి చెందిన రాహుల్ ఝాన్స్లా ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ)లు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. ఈ ఎన్నికల్లో తమ సంస్థ బాగా పోరాడిందని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఏబీవీపీకి వ్యతిరేకంగానే కాకుండా.. ఢిల్లీ పాలన యంత్రాంగం, ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు, ఆర్ఎస్ఎస్–బీజేపీ, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా కూడా తాము పోరాడినట్లు స్పష్టం చేశారు. వేలాది మంది ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు తమకు గట్టి మద్దతుగా నిలిచారని, తమ అభ్యర్థులు బాగా పోరాడారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ ప్యానెల్ నుంచి ఉపాధ్యక్షునిగా ఎన్నికైన రాహుల్ ఝాన్స్లా, గెలిచిన ఇతర ఆఫీస్ బేరర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్ఎస్యూఐ ఎల్లప్పుడూ సామాన్య విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ఢిల్లీ యూనివర్సిటీ పరిరక్షణకు పోరాడుతుందని స్పష్టం చేశారు. తాము మరింత బలపడతామని ధీమా వ్యక్తం చేశారు. 2024లో జరిగిన డీయూఎస్‌యూ ఎన్నికలలో, ఎన్ఎస్యూఐ ఏడేళ్ల విరామం తర్వాత అధ్యక్ష పదవిని, సంయుక్త కార్యదర్శి పదవిని గెలుచుకుంది. ఏబీవీపీ ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకొని, కార్యదర్శి స్థానాన్ని నిలుపుకొని విద్యార్థి సంఘ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు 40 శాతం పోలింగ్ నమోదైంది. -
బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యం
సాక్షి, భీమవరం: బ్రిటన్ మినిస్టర్ కావడమే తన లక్ష్యమని లండన్‌లోని రాయల్ బరో ఆఫ్ కెన్జింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి చెప్పారు. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి స్టూడెంట్ ఎన్నికల్లో గెలవడమే తన రాజకీయ ప్రవేశానికి కారణమని తెలిపారు. అనంతరం కన్జర్వేటివ్ పార్టీలో చేరి రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిచినట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామానికి చెందిన ఆర్యన్ ఉదయ్ శుక్రవారం.. భీమవరం వచ్చారు. తాను చదువుకున్న సెయింట్ మెరీస్ స్కూల్లో విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తన బాల్యం, చదువు, బ్రిటన్ రాజకీయాల్లో ఎదుగుదల, తన లక్ష్యాల గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. టెన్నిస్ కోసం లండన్‌కు మాది భీమవరం పక్కనే ఉన్న తుందుర్రు గ్రామం. ఆరేటి వీరాస్వామి, గొబ్బిలమ్మ తాత నాయనమ్మ. తండ్రి వెంకటసత్యనారాయణ కేజీఆర్ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. తల్లి విజయలక్ష్మి, సోదరి ఇంద్రాణి. 7వ తరగతి వరకు భీమవరంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదువుకున్నా. అప్పటికే ఏపీ తరఫున టెన్నిస్ ఆడుతున్న నేను ఆటపై ఆసక్తితో 8వ తరగతి హైదరాబాద్‌లో చేరాను. స్కూల్ నేషనల్స్, ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్‌కు ఏపీ కెపె్టన్‌గా వ్యవహరించాను. నా స్నేహితులు చాలామంది యూఎస్, యూకే వెళ్లేవారు. గ్రాడ్యుయేషన్ తరువాత టెన్నిస్ కోసం యూకే వెళ్లాను. 2006లో ఏయూ స్కాలర్షిప్ రావడంతో లండన్‌లో ఎంఎస్ చేశాను. రాజకీయాల్లోకి.. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్ష పూరిత సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడేవాడిని. అప్పుడే స్టూడెంట్స్ ఎన్నికల్లో గెలవడం నాలో ఆత్మస్థైర్యం, నమ్మకం పెంచాయి. చదువు అనంతరం అక్కడే ఉండి బిజినెస్ చేసుకుంటూ కన్జర్వేటివ్ పార్టీ ఫాలోవర్‌గా ఉన్నాను. అక్కడి సిటిజన్‌షిప్ కూడా వచ్చింది. బ్రిగ్జిట్ టైంలో డేవిడ్ కేమరూన్ టీంలో చేరాను. నా అనాలసిస్, స్ట్రాటజీని చూసి కన్జర్వేటివ్ పార్టీ తరఫున పనిచేయాలని ప్రోత్సహించేవారు. 2014లో పార్టీలో సభ్యుడిగా చేరాను. రెండు, మూడు సంవత్సరాలు పార్టీ విధివిధానాలు, రాజకీయ పరిస్థితులను సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఇక్కడి మాదిరి అక్కడ కూడా రాజకీయ పారీ్టల్లో అంతర్గత విభేదాలు, వివక్ష కామనే. ఈ పరిస్థితులను బట్టి బ్రిటిష్ వాళ్లు మనల్ని రూల్ చేయలేదు. మన అంతర్గత కొట్లాటలతో మనమే పాలించబడ్డామని నా అభిప్రాయం. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు యువత కులమతాలు, ప్రాంతీయ విభేదాలు విడిచిపెట్టి కలిసుండాలి. అనవసరమైన ఆర్భాటాలు, పబ్లిసిటీలకు దూరంగా ఉండాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగాలి. 2018, 2022ల్లో సెంట్రల్ కౌన్సిలర్‌గా ఎన్నిక నిజాం కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్కు ఆకర్షితుడినయ్యాను. లండన్‌లోను దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేసేవాడిని. భారతీయులు, మన సంప్రదాయాలను ఎంతో గౌరవించే పార్టీ చైర్మన్, మాజీ మేయర్ జూలీమీల్స్ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అందరితో కలుపుగోలుతనం నాకు కలిసొచ్చింది. ఇంటర్నల్ ఓటింగ్‌లో తెల్లవాళ్లకంటే అత్యధిక మెజార్టీ సాధించడంతో 2017లో నాకు సీట్ డిక్లేర్ అయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి సెంట్రల్ కౌన్సిలర్‌గా గెలిచాను. కౌన్సిలర్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేతో సమానం.2022 ఎన్నికల్లోను వరుస విజయాన్ని అందుకున్నాను. లండన్‌లోని ముఖ్యమైన ప్రాంతానికి డిప్యూటీ మేయర్‌గా సుమారు రెండున్నర లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్లానింగ్, లైసెన్సింగ్, ఎని్వరాన్‌మెంట్ తదితర కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాను. మేయర్ అందుబాటులో లేని సమయంలో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత్, బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఆక్వా, ఎన్విరాన్మెంట్కు సంబంధించి కొన్ని పాలసీలు చేయాలని అనుకున్నాం. కానీ సెంట్రల్ స్థాయిలో మా పార్టీ ఓడిపోవడంతో అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ఆ దిశగా కృషిచేస్తాను. దేవుడి దయతో ఈ స్థాయికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో మేయర్ కావాలన్నదే నా లక్ష్యం. ఎంపీ కావడం, అనంతరం మినిస్టర్ అవడం తదుపరి లక్ష్యాలు. -
అసభ్యకర ఫొటోలు పంపేవారు.. ఆ సీనియర్ క్రికెటర్ కార్లో కూర్చోమంటూ..
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ బిడ్డ అనయా బంగర్ (Anaya Bangar) సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. తాను ఆర్యన్ (Aryan Bangar)గా ఉన్నపుడు క్రికెటర్లతో మంచి అనుబంధం ఉండేదని.. అయితే, అనయాగా మారిన తర్వాత కొంత మంది నిజస్వరూపాలు బయటపడ్డాయంటూ విస్మయకర విషయాలు వెల్లడించింది. సీనియర్ ఆటగాడు ఒకరు తనకు అండగా మాట్లాడినట్లు నటించి.. తనతో నిద్రించాలని ఉందంటూ అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.అమ్మాయిగా మారిపోయిన ఆర్యన్కాగా టీమిండియా మాజీ కోచ్ అయిన సంజయ్ బంగర్- కశ్మీర దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. వీరిలో ఆర్యన్ పెద్దవాడు. అతడు కూడా తండ్రి బాటలోనే క్రికెటర్‌గా ఎదగాలనే ఆశయంతో దేశీ టోర్నీల్లో ఆడాడు. కానీ శరీర ధర్మానికి అనుగుణంగా తాను అబ్బాయిని కాదు.. అమ్మాయినని గుర్తించి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్నాడు.తద్వారా అమ్మాయిగా మారిపోయిన ఆర్యన్.. అనయా బంగర్గా కొత్త పేరుతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అనయా యునైటెడ్ కింగ్డమ్లో జీవిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘లలన్‌టాప్’నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. క్రికెట్ ప్రపంచంలో ఎంతో మంది విషపూరితమైన మగాళ్లు ఉన్నారంటూ అనయా బంగర్ సంచలన విషయాలు వెల్లడించింది.నేను అమ్మాయిని.. అమ్మాయిలాగే ఉండాలి‘‘నాకు అప్పుడు ఎనిమిది- తొమ్మిదేళ్ల వయసు ఉంటుంది. మా అమ్మ కబోర్డ్‌లోని దుస్తులు తీసుకుని వేసుకునే వాడిని. అద్దంలో చూసుకుని మురిసిపోయేవాడిని. అప్పుడే నాకు.. ‘నేను అమ్మాయిని.. అమ్మాయిలాగే ఉండాలి’ అనే కోరిక కలిగింది.దేశీ క్రికెట్లో నేను ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి ప్రసిద్ధ క్రికెటర్లతో ఆడాను. అప్పుడు నా శరీర ధర్మం గురించి బయటపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడిని.ఎందుకంటే.. నాన్నకు క్రికెటర్‌గా, టీమిండియా కోచ్‌గా గొప్ప పేరుంది. అందుకే నా విషయాన్ని దాచాల్సి వచ్చింది. క్రికెట్ ప్రపంచం మొత్తం అభద్రతాభావం, మగాళ్ల ఆధిపత్యంతో నిండిపోయింది.దుస్తుల్లేకుండా ఫొటోలు పంపేవారునా గురించి తెలిసిన తర్వాత కొంత మంది మంచి మాటలు చెబుతూ అండగా నిలబడ్డారు. మరికొందరు మాత్రం వేధించారు. అప్పుడప్పుడు దుస్తుల్లేకుండా వారి ఫొటోలు నాకు పంపించేవారు.ఓ వ్యక్తి అయితే అందరి ముందు నన్ను తిట్టేవాడు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి వ్యక్తిగత ఫొటోలు పంపమని అడిగేవాడు. ఇంకో సందర్భంలో ఓ వెటరన్ క్రికెటర్ తన బుద్ధిని బయటపెట్టాడు.పద కార్లో కూర్చో.. నీతో కలిసినా పరిస్థితి గురించి అతడికి చెప్పగానే.. ‘పద కార్లో కూర్చో.. నీతో కలిసి నిద్రించాలని నాకు ఆశగా ఉంది’ అంటూ చెత్త మాటలు మాట్లాడాడు’’ అని అనయా బంగర్ తాను ఎదర్కొన్న చేదు అనుభవాల గురించి పంచుకుంది.చదవండి: ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్ -
అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు.. అనయగానే నాకు ఆనందం(ఫొటోలు)
-
అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. స్త్రీగా మారినందు వల్ల..
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిపోయాడు. తండ్రి బాటలోనే క్రికెటర్‌గా అడుగులు వేసిన అతడు.. తన శరీర ధర్మానికి అనుగుణంగా అనయగా మార్పు చెందాడు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అనయ బంగర్.. స్త్రీగా మార్పు చెందడంలో తన ప్రయాణం సాగిన తీరును ప్రస్తావిస్తూ తాజాగా వీడియో షేర్ చేసింది.అంతులేని సంతోషాన్ని పొందాను‘‘శారీరకంగా బలాన్ని కోల్పోయినా.. అంతులేని సంతోషాన్ని పొందాను. నా శరీరం మారిపోయింది. అసంతృప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయితే, వేసే ప్రతీ అడుగు నాకు మరింతగా నచ్చుతోంది’’ అని అనయ తన సంతోషాన్ని పంచుకుంది.టీమిండియా బ్యాటింగ్ కోచ్గానూకాగా మహారాష్ట్రకు చెందిన సంజయ్ బంగర్ కుడిచేతి వాటం బ్యాటర్. అదే విధంగా.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా. 2001- 2004 మధ్య టీమిండియా తరఫున ఈ ఆల్‌రౌండర్ 12 టెస్టులు, 15 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 470, 180 పరుగులు సాధించాడు. అలాగే.. టెస్టుల్లో ఏడు, వన్డేల్లో ఏడు వికెట్లు తీశాడు.టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గానూ పనిచేసిన 52 ఏళ్ల సంజయ్ బంగర్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. కశ్మీరతో అతడికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడైన ఆర్యన్ బంగర్ ఇప్పుడు అనయ బంగర్గా మారాడు. కాగా అనయ కూడా క్రికెటర్‌గా ఎదగాలనే ఆశయంతో ఉంది.గతంలో భారత దేశీ టోర్నీల్లోనూ ఆడిన అనయ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్నట్లు సమాచారం. ట్రాన్స్ వుమన్కు క్రికెట్ ఆడే అవకాశం లేనందు వల్ల తన కలకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అనయ ఇటీవల ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ షేర్ చేసింది.మా నాన్న బాటలో నడవాలనున్నాను.. కానీ‘‘నా ప్రేమ.. నా కల.. నా ఆశయం.. నా భవిష్యత్తు.. అంతా క్రికెటే. మా నాన్న టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే కాదు.. కోచ్‌గానూ పనిచేశాడు. ఆయనను చూస్తూ పెరిగిన నేను ఆయన అడుగుజాడల్లో నడవాలని భావించాను. క్రికెట్లో నా నైపుణ్యాలను పెంచుకునేందుకు కృషి చేశాను.కానీ అర్ధంతరంగా ఆటను ఇలా వదిలేయాల్సి వస్తుందని అనుకోలేదు. అయితే, ఈ చేదు నిజాన్ని అంగీకరించకతప్పదు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసుకున్న తర్వాత ట్రాన్స్ వుమన్‌గా నాలో చాలా మార్పులు వచ్చాయి.కండబలం తగ్గిందినా శరీరం మొత్తం పూర్తిగా మారిపోయింది. నా కండబలం తగ్గింది. శక్తిని కోల్పోయాను. అథ్లెట్లకు ఉండాల్సిన పవర్ మెల్లమెల్లగా తగ్గింది. ట్రాన్స్వుమన్కు కూడా క్రికెట్ ఆడే అవకాశాలు ఇవ్వాలి’’ అని అనయ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం.. ట్రాన్స్జెండర్లకు ఇంటర్నేషనల్ స్థాయిలో మహిళా క్రికెట్ ఆడే వీలు లేదు. 2023లో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ భవితవ్యం, వుమెన్ ప్లేయర్ల భద్రత, సమగ్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? View this post on Instagram A post shared by Anaya Bangar (@anayabangar) View this post on Instagram A post shared by Anaya Bangar (@anayabangar) -
Aryan Chauhan: అద్భుతాల ఆర్యన్!
అద్భుతాలు ఆకాశం నుంచి ఊడిపడవు. ఆలోచనల్లో నుంచి పుడతాయి. దిల్లీకి చెందిన ఆర్యన్ చౌహాన్ చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా పెద్ద విజయం సాధించడానికి ఆ ఆలోచనలే కారణం. కొత్తదనాన్ని ఆవిష్కరించే ఆలోచనలు అవి. కొత్త తరం ఆలోచనలు అవి...ఇరవై రెండు సంవత్సరాల ఆర్యన్ చౌహాన్ ట్రాక్ రికార్డ్ ‘ఆహా’ అనేలా ఉంటుంది. పద్నాలుగు సంవత్సరాల వయసులోనే స్టార్టప్‌లకు సహాయపడే స్టార్టప్‌ను మొదలుపెట్టాడు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ప్రసిద్ధ జెరోమ్ ఫిషర్ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీకి ఎంపికైన తక్కువ మందిలో ఆర్యన్ ఒకడు.కోవిడ్ సమయంలో స్వదేశానికి తిరిగివచ్చాడు ఆర్యన్. ఆ సమయంలో అతడి మనసు నిండా కొత్త స్టార్టప్ ఆలోచనలు నిండి ఉన్నాయి. అయితే ఏమీ చేయలేని అనిశ్చితి బయట నెలకొని ఉంది. ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకున్నాడు ఆర్యన్. 2021లో ‘జీవోవ్’పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు.తన తల్లితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘జీవోవ్’ పేరుతో రెండో కంపెనీ స్టార్ట్ చేశాడు. టెక్–ఫస్ట్ అ్ర΄ోచ్తో డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంచే కంపెనీ ఇది. పర్సనలైజ్ రెమిషన్ ΄్లాన్స్ నుంచి నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) పరికరాల వరకు కంపెనీలో ఎన్నో ఉంటాయి. ఇంతకీ ఆర్యన్‌కు ‘జీవోవ్’ ఆలోచన ఎలా వచ్చింది?‘డయాబెటిస్ బాధితులను దగ్గరి నుంచి చూశాను. మా తాతయ్యలు ఇద్దరూ డయాబెటిస్తో బాధలు పడ్డారు. ఆ సమయంలోనే ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించాలనుకున్నాను’ అంటాడు ఆర్యన్. క్రానిక్ కేర్ బిజినెస్‌గా ్ర΄ారంభమైన ‘జీవోవ్’ కంపెనీ న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ ట్రైనర్స్, సైకాలజిస్ట్‌లను పేషెంట్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తక్కువ సమయంలోనే కంపెనీ 70,000లకు పైగా వినియోగదారులతో విజయపథంలోకి వచ్చింది.ప్రొడక్ట్‌ను క్రియేట్ చేయడం నుంచి మార్కెట్లో విజయవంతం చేయడం వరకు ఆర్యన్‌లో అద్భుత సామర్థ్యం ఉంది. వేగంగా నేర్చుకునే తత్వం, నిర్మాణాత్మక పనివిధానం అతడి సొంతం. ఏ ్ర΄ాజెక్ట్ చేపట్టినా విజయవంతం చేయాలనే పట్టుదలతో పనిచేస్తాడు. నెవర్–సే–డై స్పిరిట్ ఆర్యన్‌ను క్వాలిటీ ఫౌండర్‌ని చేసింది’ అంటాడు ‘స్నాప్‌డీల్ అండ్ టైటాన్ క్యాపిటల్’ ఫౌండర్ కునాల్ బహల్. కునాల్ బహల్ జెరోమ్ ఫిషర్ ప్రోగ్రామ్ పూర్వ విద్యార్థి.‘జీవోవ్’కు ముందు కునాల్‌తో కలిసి పనిచేశాడు ఆర్యన్. ‘స్నాప్‌డీల్ అండ్ టైటాన్ క్యాపిటల్’లో ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, డీ2సీ సెగ్మెంట్లను లీడ్ చేశాడు. ‘ఇది చాలు’ అనుకోవడం లేదు ఆర్యన్ చౌహాన్. ‘జాయిన్ ది రెవల్యూషన్’ నినాదంతో నెక్ట్స్ గ్రోత్ పేస్పై దృష్టి పెట్టాడు. -
అత్తింటి ఆరళ్లకు ముగ్గురు బలి
కరీంనగర్ రూరల్: అదనపు కట్నం కోసం అత్తింటివేధింపులను తట్టుకోలేక ఏడాది బిడ్డకు విషగుళికలు ఇచ్చి చంపిందా తల్లి. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని తట్టుకోలేక మృతురాలి తల్లి సైతం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకేరోజు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. బొమ్మకల్ గ్రామ పంచాయతీ విజయ్‌నగర్‌కాలనీలో ఉంటున్న ఉపాధ్యాయ దంపతులు గద్దె వెంకటేశ్వరచారి– జయప్రద(55) తమ చిన్న కూతురు శ్రీజ(25)కు మూడేళ్లక్రితం వరంగల్ జిల్లా మొగ్ధుంపూర్‌కు చెందిన నరేశ్‌తో కట్నకానుకలతో వివాహం జరిపించారు. ఏడాదిపాటు సక్రమంగా కాపురం చేసిన నరేశ్... కొడుకు ఆర్యన్(1) పుట్టాక శ్రీజను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అత్తమామలు సుజాత–కేశవచారి హింసించడంతో శ్రీజ గత నెల 29న బొమ్మకల్‌లోని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం 6గంటలకు కొడుకు మొదటి బర్త్‌డే గురించి నరేశ్‌కు శ్రీజ ఫోన్ చేయడంతో అత్తమామలు, భర్త కలిసి తీవ్రంగా దూషించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీజ క్రిమిసంహారక మాత్రలను కొడుకు ఆర్యన్‌కు తాగించి ఆ తర్వాత తానూ వేసుకుంది. అపస్మారకస్థితిలో పడి ఉన్న తల్లి, కొడుకులను జయప్రద, వెంకటేశ్వరచారి అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బిడ్డ మృతిచెందగా శ్రీజ చికిత్స పొందుతూ చనిపోయింది. కూతురు, మనవడి మృతిని తట్టుకోలేక జయప్రద ఇంటికివెళ్లి క్రిమిసంహారక మాత్రలు వేసుకుంది. ఆస్పత్రిలో చేరి్పంచగా పరిస్థితి విషమించి మృతి చెందింది. -
భారత బాస్కెట్‌బాల్ జట్టులో ఆర్యన్
ఆసియా కప్ అండర్–16 బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణకు చెందిన ఆర్యన్ శర్మకు చోటు లభించింది. ఈ టోర్నీ ఈనెల 17 నుంచి 24 వరకు ఖతర్ రాజధాని దోహాలో జరుగుతుంది. హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన ఆర్యన్ శర్మ భారత కోచ్ పీఎస్ సంతోష్ ఆధ్వర్యంలో కీస్టోన్ బాస్కెట్‌బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటాడు. ఈ టోరీ్నలో రాణిస్తే భారత జట్టు వచ్చే ఏడాది జూలైలో తుర్కియేలో జరిగే ప్రపంచకప్ అండర్–17 టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది. -
Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు!
పునర్జన్మ... ఇది యావత్ మానవాళికీ అంతుచిక్కని ప్రశ్న. పునర్జన్మ ఉందని కొందరు అంటుంటే, అస్సలు లేదని మరికొందరు వాదిస్తుంటారు. అయితే అప్పుడప్పుడు తమ పునర్జన్మ ఇదేనంటూ పలువురు పూసగుచ్చినట్లు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మైన్పూర్ జిల్లాలో పునర్జన్మకు సంబంధించిన ఒక ఉదంతం కలకలం రేపుతోంది. ఎనిమిదేళ్ల కుర్రాడు తన అమ్మమ్మను తన భార్య అని చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ మాటవినగానే మొదట ఆ కుర్రాడి కుటుంబ సభ్యులు దానిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ కుర్రాడు చెబుతున్న గతంలోని సంఘటనలు విన్నాక కుటుంబ సభ్యులంతా తెగ ఆశ్చర్యపోయారు. పునర్జన్మకు సంబంధించిన ఈ విచిత్ర ఉదంతం ఎలావూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. జూన్ 15న 8 ఏళ్ల అర్యన్ తన తల్లితోపాటు రతన్‌పూర్ గ్రామానికి వచ్చాడు. ఆ కుర్రాడి తల్లి.. ‘వెళ్లి.. అమ్మమ్మ కాళ్లకు దండం పెట్టు’ అని అతనితో చెప్పింది. వెంటనే ఆ కుర్రాడు ‘ఈమె నా అమ్మమ్మ కాదు. నా భార్య’ అని అని చెప్పాడు, అలాగే అక్కడే ఉన్న మేనమామను తన కుమారుడు అని ఆర్యన్ చెప్పాడు. ఆర్యన్ మాటలను తొలుత కుటుంబ సభ్యులు తేలికగా తీసుకున్నారు. అయితే ఆ కుర్రాడు అదే విషయాన్ని పదపదే చెప్పడంతోపాటు, గతంలో వారి కుటుంబంలో జరిగిన అన్ని ఘటనలను పూసగుచ్చినట్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఇవన్నీ తన గత జన్మకు సంబంధించిన విషయాలని తెలిపాడు. గత జన్మలో తన పేరు మనోజ్ మిశ్రా అని, 8 ఏళ్ల క్రితం అంటే 2015 జనవరి 9న తాను పొలంలో పని చేస్తుండగా, అక్కడ ఒక రంధ్రం కనిపించిందని, దానిని కాలితో మూసివేసే ప్రయత్నం చేస్తుండగా పాము కరిచిందని తెలిపాడు. తాను వెంటనే స్పృహ కోల్పోయానని, తనను ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలో మృతిచెందానని చెప్పాడు. పిల్లాడి నోటి నుంచి వచ్చిన ఈ మాటలు వినగానే అక్కడున్నవారంతా హడలెత్తిపోయారు. ఇదంతా వాస్తవమేనని, ఆ కుర్రాడు గత జన్మలో మనోజ్ మిశ్రా అని వారు గుర్తించారు. ఆర్యన్ ఇంకా వివరాలు చెబుతూ తాను చనిపోయిన సమయంలో తన కుమార్తె( ఆర్యన్ తల్లి) గర్భవతి అని తెలిపాడు. తాను చనిపోయాక తన దశదిన కర్మలు ముగిసిన వెంటనే తన కుమార్తె రంజన.. కుమారునికి జన్మనిచ్చిందని అన్నాడు. ఇంత చిన్న కుర్రాడు ఇన్ని విషయాలు తెలియజేయడం చూసిన అక్కడున్నవారంతా తెగ ఆశ్చర్యపోయారు. ఆర్యన్‌ది పునర్జన్మే అంటూ వారు అందరికీ చెబుతున్నారు. ఆర్యన్ తన అమ్మమ్మ నీరజ్ మిశ్రాను తన భార్య అని, మేనమామలైన అనుజ్, అజయ్‌లను తన కుమారులని, తన తల్లి రంజనను తన కుమార్తె అని చెబుతున్నాడు. ఆర్యన్ మేనమామ అజయ్ మాట్లాడుతూ నాలుగేళ్ల వయసు నుంచి ఆర్యన్ గత జన్మ విషయాలను చెబుతున్నాడని, అయితే మేము దీనిని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని, ఇప్పుడు నమ్మక తప్పడం లేదని అన్నారు. ఈ మధ్య ఆర్యన్ చెబుతున్న విషయాలు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయని అన్నారు. ఆర్యన్ అమ్మమ్మ నీరజ్ మిశ్రా ఆ కుర్రాడి మాటలు నిజమేనని చెబుతోంది. ఇది కూడా చదవండి: బంగారు నగరంలో చీకటి సామ్రాజ్యం.. జన జీవనం సాగుతుందిలా.. -
బంతితో బోల్తా కొట్టించి.. అద్భుతమైన క్యాచ్‌తో మెరిసి! బాబర్ సెంచరీ మిస్
Netherlands vs Pakistan, 3rd ODI (Rescheduled match): పాకిస్తాన్‌తో నామమాత్రపు మూడో వన్డేలో నెదర్లాండ్స్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. పర్యాటక జట్టును 206 పరుగులకే ఆలౌట్ చేశారు. కెప్టెన్ బాబర్ ఆజం ఒక్కడే 91 పరుగులతో రాణించడంతో పాకిస్తాన్ ఈ మేరకు స్కోరు నమోదు చేయగలిగింది. రీషెడ్యూల్డ్ వన్డే సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో పర్యటిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ అద్భుత పోరాటం కనబరిచింది. ఆఖరి వరకు పోరాడి 16 పరుగులతో ఓటమి పాలైంది. ఇక రెండో వన్డేలో మాత్రం పాక్ జట్టు.. ఆతిథ్య జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. ఓపెనర్లు విఫలం! ఈ క్రమంలో ఆదివారం(ఆగష్టు 21) రోటర్‌డామ్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పర్యాటక జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు షఫీక్, ఫఖర్ జమాన్ వరుసగా 2, 26 పరుగులు(43 బంతుల్లో) చేసి నిష్క్రమించారు. బాబర్ ఆజం(PC: PCB) బాబర్ ఆజం సెంచరీ మిస్! ఇలాంటి పరిస్థితుల్లో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజం క్రీజులో పాతుకుపోయాడు. 125 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేసి స్కోరు బోర్డును పరిగెత్తించే ప్రయత్నం చేశాడు. కానీ.. 43వ ఓవర్ నాలుగో బంతికి ఆర్యన్ దత్ అద్బుత బంతితో ఆజంను బోల్తా కొట్టించాడు. ఒంటి చేత్తో క్యాచ్ పట్టి పెవిలియన్‌కు పంపాడు. దీంతో సెంచరీ చేసే అవకాశం పాక్ కెప్టెన్ చేజారింది. 🟠 | @aryandutt77 in fine form 🤌#CricketNL #NEDvPAK #CWCSL https://t.co/ZeOPzJHDfX — Cricket🏏Netherlands (@KNCBcricket) August 21, 2022 మిగతా బ్యాటర్లలో ఆఘా సల్మాన్ 24, నవాజ్ 27 పరుగులు, మహ్మద్ వసీం జూనియర్ 11 పరుగులు చేయగా.. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో 49.4 ఓవర్లలో 206 పరుగులు చేసి బాబర్ ఆజం బృందం ఆలౌట్ అయింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కింగ్మా రెండు, ఆర్యన్ దత్ ఒకటి, బాస్ డీ లీడే మూడు, షారిజ్ అహ్మద్ ఒకటి, వాన్ బీక్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చదవండి: Yuzvendra Chahal Wife: నాకు రెస్ట్ అవసరమైన సమయంలోనే ఇలాంటివన్నీ! నువ్వు నా దానివి! టీమిండియాను విమర్శించిన పాక్ అభిమానులు.. కనేరియా దిమ్మతిరిగే కౌంటర్! -
క్షణాల్లో కరోనాను గుర్తించే యాప్
ఢిల్లీ : ఆర్కే పురం డీపీఎస్‌లో విద్యను అభ్యసిస్తున్న 17 ఏళ్ల ఢిల్లీకి చెందిన ఆర్యన్ గులాటి కోవిడ్-19తోపాటూ ఊపిరితిత్తుల సమస్యలను సులభంగా గుర్తించే వెబ్ ఆధారిత యాప్ ‘లంగ్‌ఏఐ’ను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ యాప్‌తో హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆత్మనిర్భర్ భారత్ ఐడియాథాన్లో సత్తాచాటిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. కేవలం 3 నుంచి 5 సెకన్ల వ్యవధిలో ఊపిరితిత్తుల్లో ఉన్న సమస్యలను లంగ్‌ఏఐ యాప్ గుర్తించగలుగుతుంది.(‘అమెరికా ల్యాబ్‌లో తేల్చుకుందాం’) ఆత్మనిర్భర భారత్ ఐడియాథాన్లో సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ విభాగంలో ఆర్యన్ గులాటి విజేతగా నిలిచాడు. అతను తయారు చేసిన వెబ్-ఆధారిత అప్లికేషన్ లంగ్ఏఐతో కోవిడ్-19, ఊపిరితిత్తుల క్యాన్సర్, న్యుమోనియా, క్షయలతో పాటూ వివిధ రకాల ఊపిరితిత్తుల సమస్యలను సులభంగా గుర్తించవచ్చు. ఐడియాథాన్లోని ఐదు విభాగాలలో ఐదుగురు విజేతల్లో ఆర్యన్ అతి పిన్నవయస్కుడు. జాతీయ స్థాయిలో లంగ్‌ఏఐ యాప్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 2 లక్షల రూపాయలను ఆర్యన్‌కు ప్రోత్సాహకంగా అందించింది. (మధ్యప్రదేశ్ మంత్రికి సోకిన కరోనా) లంగ్‌ఏఐ ఎలా పనిచేస్తుందంటే.. మీరు చేయవలసిందల్లా లంగ్‌ఏఐ వెబ్సైట్లో ఛాతీ ఎక్స్-రే లేదా సీటీ స్కాన్‌ను అప్లోడ్ చేయాలి. అనంతరం కేవలం 3 నుండి 5 సెకన్లలోపు ఫలితాన్ని పొందుతారు. వెబ్సైట్ 90శాతానికి పైగా ఖచ్చితత్వ రేటింగ్‌ను కలిగి ఉంది. వెబ్‌సైట్‌లోని ఆటోమేటిక్ మెసేజింగ్ సిస్టమ్ ద్వారా మీరు లంగ్‌ఏఐ ఫలితాన్ని వివిధ వైద్యులు, ఆసుపత్రులకు పంపవచ్చు. రిపోర్టులో కోవిడ్- 19 పాజిటివ్‌గా తేలినట్టయితే, వెబ్సైట్లోనే చికిత్సా సమాచారంతోపాటూ సమీప ఆసుపత్రుల వివరాలు బాధితుడికి అందుబాటులో ఉంటాయి. ‘కరోనా పరీక్షలను వేగంగా, ఖచ్చితంగా, మరీ ముఖ్యంగా ప్రస్తుత పరీక్షా పద్ధతుల మాదిరిగా కాకుండా రోగులతో ముఖాముఖిలేకుండానే గుర్తించే ప్రక్రియను కనుగొనాలని అనుకున్నాను’ అని ఆర్యన్ అన్నారు. లంగ్‌ఏఐ అప్లికేషన్ ఓపెన్ డొమైన్లో అందుబాటులో లేనప్పటికీ, మరింత విశ్లేషణ, తదుపరి పరీక్షల కోసం ఐసీఎమ్ఆర్తో ఆర్యన్ చర్చలు జరుపుతున్నాడు. -
కొత్త తారలతో ‘సంతోషత్తిల్ కలవరం’
తమిళసినిమా: నూతన తారలతో తెరకెక్కుతున్న చిత్రం సంతోషత్తిల్ కలవరం. ఈ చిత్రం ద్వారా క్రాంతి ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు పలు లఘు చిత్రాలను రూపొందించి అవార్డులను అందుకున్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థి క్రాంతి ప్రసాద్ కొందరు తెలుగు దర్శకుల వద్ద పని చేశారు. ఈ సంతోషత్తిల్ కలవరం చిత్రాన్ని శ్రీ గురు సినిమాస్ పతాకంపై వీసీ.తిమ్మారెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక సంతోషకరమైన సమయంలో ఆందోళన జరిగితే ఆ పరిణామాలు ఏటు దారి తీస్తాయన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతి వృత్తం అన్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ చిత్రం లో ప్రేమ, స్నేహం, హాస్యం, ఆధ్యాత్మికం అంటూ జనరంజకమైన అంశాలన్నీ ఉంటాయన్నారు. ఇందులో నిరంత్, రుద్రాఆరా, ఆర్యన్, జై జగన్నాథ్, రాహుల్.సి కల్యాణ్, గౌతమి, సౌజన్య, ఆపేక్ష నూతన నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. దీనికి శివనాగ్ సంగీతాన్ని అందిస్తుండగా పౌవులియస్ ఛాయాగ్రహణం నెరపుతున్నారని చెప్పారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. -
ఆ విషయం నాకు ముందే చెప్పారు
‘గంగ, అంపశయ్య, ఎర్రబస్సు, ఎలుకా మజాకా, లావణ్య విత్ లవ్‌బాయ్స్’ తదితర సినిమాల్లో అలరించిన పావని నటించిన తాజా చిత్రం ‘లవర్స్ క్లబ్’. అనిష్ చంద్ర, ఆర్యన్, పూర్ణి ప్రధానపాత్రల్లో ధృవశేఖర్ దర్శకత్వంలో ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో భరత్ అవ్వారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. పావని మాట్లాడుతూ – ‘‘మా తాతగారికి స్టేజ్ అనుభవం ఉంది. నేను కూడా చాలా నాటకాల్లో నటించాను. సినిమా ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు మా నాన్నగారు, సోదరులు సపోర్ట్ చేశారు. ‘లవర్స్ క్లబ్’లో డాక్టర్‌గా చేశా. అనుకోని కారణాలు, సమస్యల వల్ల ఇంటి నుంచి బయటకు వచ్చేస్తా. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాని ఐ ఫోన్లో షూట్ చేస్తామని నాకు ముందే చెప్పారు. నేను వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. లీడ్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వస్తున్నాయి. లీడ్ అనే కాకుండా, నటనకు ఆస్కారం ఉండే పెద్ద చిత్రాల్లోనూ చేయాలని ఉంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. ఈ నెల 13న ఓ సినిమా మొదలవుతుంది’’ అన్నారు. -
ప్రేమికుల అడ్డా
‘‘ఓ యువకుడు ప్రేమికులకు అండగా నిలబడుతుంటాడు. అటువంటి ఆ యువకుడి జీవితంలో అనుకోని సమస్యలు వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నది ‘లవర్స్ క్లబ్’ చిత్రంలో ఆసక్తికరం’’ అన్నారు దర్శకుడు ధృవ శేఖర్. అనీష్ చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో భరత్ అవ్వారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ధృవ శేఖర్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశాం. ఇంతవరకు ఎవరూ తీయని విధంగా ఫస్ట్ టైమ్ ఐ ఫోన్ టెక్నాలజీ ఉపయోగించి షూటింగ్ చేశాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా కథే బలమని ఇటీవల ప్రేక్షకులు నిరూపించారు. కథ బాగుంటే ఆదరిస్తారనే ధైర్యంతో ఈ సినిమా తీశాం’’ అని భరత్ అవ్వారి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి నిడమర్తి, నేపథ్య సంగీతం: కమల్.డి, కెమెరా: డి.వి.ఎస్.ఎస్. ప్రకాష్ రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: మదన్ గంజికుంట, అవ్వారి ధను, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ నవీన్ పుష్పాల, శ్రీ చందన గాలిపల్లి. -
లిప్ లాక్ చేస్తే ఊరుకోను!
‘దేశానికి రాజైనా తల్లితండ్రులకు కొడుకే. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎంత పెద్ద స్టార్ అయినా పిల్లలకు మాత్రం తండ్రే. తన కుమార్తె సుహానా, కుమారుడు ఆర్యన్ క్రమశిక్షణ విషయంలో షారుక్ చాలా కఠినంగా ఉంటారు. సుహానా బాయ్‌ఫ్రెండ్‌తో, ఆర్యన్ గర్ల్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉండే ఫొటోలు గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. పిల్లల ఫ్రెండ్షిప్, ప్రేమ వ్యవహారాలపై బాద్షా బహిరంగంగా స్పందిస్తూ ఉంటారు. ఇటీవల కూడా ఓ ఇంటర్వూ్యలో పిల్లల క్రమశిక్షణపై స్పందించి, కూతురు, కొడుక్కి హెచ్చరికలు జారీ చేశారీ కింగ్ ఖాన్. ‘‘సుహానే పెదవులను తన బాయ్ ఫ్రెండ్ ముద్దు పెట్టుకుంటే వాడి పెదాలు కోసేస్తా. ఆర్యన్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి లిప్ కిస్ ఇచ్చినా, లేక గర్ల్‌ఫ్రెండే ఆర్యన్‌కు లిప్ కిస్ ఇచ్చినా వాడి పెదాలు(ఆర్యన్) కోసేస్తా’’ అని బహిరంగంగా తన పిల్లలకు వార్నింగ్ ఇచ్చారు. ‘లిప్ కిస్’ పై షారుక్ ఎందుకంత సీరియస్ అయ్యారని కొందరు విమర్శించినా, పిల్లల మంచీ.. చెడూ ఆలోచించే బాధ్యత గల తండ్రిగా ఆయన కరెక్ట్‌గానే చెప్పారని మెజారిటీ వర్గం షారుక్‌ని అభినందిస్తోంది. -
నార్వే అధికారులను కలిసిన భారత రాయబారి
బాలుడిని అధికారులు తీసుకెళ్లిన కేసు న్యూఢిల్లీ: నార్వేలో భారతీయురాలికి జన్మించిన చిన్నారిని అధికారులు తీసుకెళ్లిన కేసు విషయమై ఓస్లో (నార్వే రాజధాని)లోని భారత రాయబారి మంగళవారం సంబంధిత అధికారులను కలిశారు. తల్లిదండ్రులు చిన్నారిని సరిగా చూసుకోవడం లేదని ఫిర్యాదు అందడంతో కొన్ని రోజుల క్రితం ఐదున్నరేళ్ల బాలుడిని అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో బాలుడి తల్లికి భారత పౌరసత్వం ఉండగా, తండ్రి, బాలుడు నార్వే పౌరులు. తమ బిడ్డను అనవసరంగా, అన్యాయంగా అధికారులు తమకు దూరం చేస్తున్నారనీ, కేసులో కలగజేసుకుని కొడుకును మళ్లీ తమ వద్దకు చేర్చాలని గతంలో తల్లి గుర్విందర్‌జిత్ కౌర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విన్నవించారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారు. తత్ఫలితంగా మంగళవారం భారత రాయబారి నార్వే అధికారులను కలవగా, చాలా సున్నితత్వంతో నార్వే చట్టాల ప్రకారం ఈ కేసును పరిష్కరిస్తున్నామని వారు తెలిపారు. సమావేశానికి ముందు ఈ విషయంపై భారత్‌లో సుష్మ మాట్లాడుతూ బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. బిడ్డలను కన్న తల్లిదండ్రులే బాగా చూసుకోగలరనీ, పెంపుడు తల్లిదండ్రులకు భారతీయ సంస్కృతి, మన ఆహార అలవాట్ల గురించి ఏమీ తెలీదని అన్నారు. నార్వేలో చిన్నారుల సంరక్షణకు సంబంధించి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తల్లిదండ్రులు సరిగా చూసుకోవడం లేదనే ఆరోపణలపై భారత సంతతి పిల్లలను నార్వే అధికారులు కస్టడీలోకి తీసుకోవడం ఇది మూడోసారి. 2011లో మూడున్నరేళ్లు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు పిల్లలను అధికారులు తీసుకెళ్లగా నాటి యూపీఏ ప్రభుత్వం పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించాల్సిందిగా నార్వే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అనంతరం చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించాలని నార్వే కోర్టు తీర్పునిచ్చింది. 2012 డిసెంబరులో ఇదే విషయమై మరో భారతీయ జంటను అధికారులు జైలులో వేశారు. 7 ఏళ్లు, రెండేళ్ల వయసున్న వారి ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌లోని తాతయ్య, అమ్మమ్మల దగ్గరకు పంపించారు. -
ఆర్యన్, అభిషేక్ సెంచరీలు
ఎ-డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: సెయింట్ ఆండ్రూస్ బ్యాట్స్‌మెన్ ఆర్యన్ కృష్ణ (136 బంతుల్లో 136; 18 ఫోర్లు), అభిషేక్ పరాడ్కర్ (110 బంతుల్లో 143; 27 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా న్యూస్టార్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్ జట్టు 279 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ ఆండ్రూస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 377 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో ముదస్సిర్ 5, హసన్ 3 వికెట్లు తీశారు. అనంతరం న్యూస్టార్ జట్టు 29.3 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆల్‌సెయింట్స్ హైస్కూల్‌తో జరిగిన మరోమ్యాచ్‌లో కిషోర్‌సన్‌స జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. కిషోర్‌సన్‌స తొలుత 30 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటవగా... ఆల్‌సెయింట్స్ స్కూల్ 28.3 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కిషోర్‌సన్‌స బౌలర్ వినయ్ కుమార్ 5 వికెట్లతో రాణించాడు. -
‘ఆర్యన్’గా నేడు ప్రేక్షకుల ముందుకు శివణ్ణ
ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్, నటి రమ్య ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఆర్యన్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, రమ్య అథ్లెట్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు బెంగళూరు నగర పరిసరాల్లోనే జరిగింది. ఇక ఈ సినిమాకు మొదట దర్శకత్వం వహించిన డీ రాజేంద్రబాబు గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన నేపథ్యంలో సినిమా చిత్రీకరణలో మిగిలిన భాగానికి గురుదత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే శాండల్‌వుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో శాండల్‌వుడ్‌లో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. -
రెండో రౌండ్లో రాహుల్, ఆర్యన్
ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఏస్టర్ మైండ్స్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో రాహుల్, ఆర్యన్ లడ్హా ముందంజ వేశారు. ఏస్టర్ టెన్నిస్ అకాడమీలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో శనివారం బాలుర అండర్-12, 14 సింగిల్స్ తొలిరౌండ్ పోటీలు జరిగాయి. అండర్-12లో రాహుల్ 7-3తో శ్రీచరణ్‌పై, ఆర్యన్ 7-2తో అనికేత్ మోడిపై గెలుపొందారు. ఇతర మ్యాచ్‌ల్లో ఆర్య జాదవ్ 7-3తో వేదాంత్‌పై, అమోగ్ పెద్దిరెడ్డి 7-1తో జైకృష్ణ పాల్‌పై, శశివర్ధన్ రెడ్డి 7-6 (7/5)తో రిత్విక్ యాదవ్‌పై, శ్రీకార్తీక్ 7-1తో దేవేందర్‌పై విజయం సాధించారు. ఆర్యన్ లాహ 7-2తో తరుణ్ సేపూరిపై నెగ్గగా, అర్చిత్ 7-5తో సయ్యద్ ఫజల్ అలీని ఓడించాడు. రాహుల్ చందన్ 7-1తో కార్తీక్ వడ్డేపల్లిపై, శౌర్య బన్సాల్ 7-2తో సాక్షం గుప్తాపై, యశ్వంత్ 7-1తో ఆమిర్ కపాడియాపై, ముకుంద్ రెడ్డి 7-1తో ఆదిత్యపై, ప్రమోద్ 7-2తో పులకిత్‌పై నెగ్గారు. నవనీత్ సింగ్‌కు 1-7తో జై అర్జున్ చేతిలో, రోహన్‌కు 3-7తో అక్షిత్ చేతిలో చుక్కెదురైంది. బాలుర అండర్-14 ఫలితాలు శశి ప్రీతమ్ 7-2తో సాయి స్నేహల్‌పై, రాహుల్ 7-3తో సుహిత్ రెడ్డిపై, సీహెచ్ అనికేత్ 7-2తో రిత్విక్ యాదవ్‌పై, కౌషిక్ రెడ్డి 7-0తో పద్మేశ్పై, సాయి పృత్విక్ 7-2తో అర్చిత్, యువరాజ్ రాలేపల్లి 7-1తో సాక్షం గుప్తాపై, సయ్యద్ పాషా 7-2తో ఆమిర్ కపాడియాపై, రాహుల్ చందన్ 7-4తో సుమంత్ రెడ్డిపై గెలుపొందారు.