
విష్ణు విశాల్ హీరోగా నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘ఆర్యన్’. శ్రద్ధా శ్రీనాథ్, మానసా చౌదరి, సెల్వ రాఘవన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ .కె దర్శకత్వం వహించారు. శుభ్ర, ఆర్యన్ రమేశ్‌లతో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ పతాకంపై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా నుంచి ‘ఐయామ్ ది గై... ఐయామ్ ది గై ఫర్ యు...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఆవేశం అస్సలాపుకోను... నీ కోసం మారి తీరతాను... సన్యాసం స్వర్గమయ్యే నేడు... నీకేం తెలుసులే..’ అన్న లిరిక్స్‌తో ఈ పాట సాగుతుంది. సామ్రాట్ ఈ సినిమాకు సాహిత్యం అందించగా, ఈ చిత్రసంగీతదర్శకుడు జిబ్రాన్‌తో కలిసి శ్రీకాంత్ హరిహరన్ పాడారు. సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.