కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన లేటేస్ట్ మూవీ ఆర్యన్. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే తమిళనాడు థియేటర్లలో విడుదలైంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దర్శకుడు కె ప్రవీణ్ తెరకెక్కించారు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ఈ చిత్రానికి తొలి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా అంతగా రాణించలేకపోతోంది.
అయితే ఈ మూవీలోని క్లైమాక్స్ సీక్వెన్స్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. ఈ మూవీ క్లైమాక్స్‌లో విలన్ సెల్వ రాఘవన్ ఆ నలుగురిని ఎందుకు చంపాడనేది ఈ సీన్‌తో సెట్ కాలేదని ప్రేక్షకులు సోషల్ మీడియాలో వేదికగా నిలదీశారు. ఆ సన్నివేశం స్క్రీన్‌ప్లేతో సరిపోలేదని ఆడియన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో ఆర్యన్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీలో కీలకమైన క్లైమాక్స్ చివరి పది నిమిషాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో ఆ సీన్లను తీసేసినట్లు తెలిపారు. ఈ రోజు నుంచి థియేటర్లలో సెల్వ రాఘవన్ క్లైమాక్స్ సీన్స్ కట్ చేసినట్లు వెల్లడించారు. కొత్త వెర్షన్ సోమవారం నుంచే థియేటర్లలోకి వస్తుందని ఆర్యన్ నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ చిత్రంలోని పది నిమిషాల క్లైమాక్స్ సీన్స్ తెలుగు వెర్షన్ నుంచి తొలగించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ అక్టోబర్ 31న విడుదల చేయాలని భావించారు. కానీ రవితేజ మాస్ జతార, ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి: ది ఎపిక్ రిలీజ్ కావడంతో వాయిదా వేసుకున్నారు. ఈ మూవీని నవంబర్ 7న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీని విష్ణు విశాల్ తన బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతమందించారు.
#Aaryan - The suspense soars in theatres now, with solid audience response 💥
A big opening weekend for the film all over!@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish @Sanlokesh @silvastunt @PC_stunts… pic.twitter.com/Wa0lezNEaj— Vishnu Vishal Studioz (@VVStudioz) November 3, 2025

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
