తెరపైకి సుభాష్‌ చంద్రబోస్‌ జీవిత చరిత్ర.. హీరో ఇతనే! | Aryan Shyam To Play Lead Role In Subhas Chandra Bose Biopic, Film To Be Made In Multiple Languages | Sakshi
Sakshi News home page

తెరపైకి సుభాష్‌ చంద్రబోస్‌ జీవిత చరిత్ర.. హీరో ఇతనే!

Jun 15 2026 8:52 AM | Updated on Jun 15 2026 11:11 AM

Subhas Chandra Bose Biopic Announced, Aryan Shyam To Play Lead Role

నేతాజీగా భారత పౌరుల గుండ్లెలో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వాతంత్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌. ఈయన జీవిత చరిత్రను ఇప్పుడు తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ జెమిని ఫిలిం సర్క్యూట్‌ సంస్థ నిర్మింనుంది. ఇందులో టైటిల్‌ పాత్రను యువ నటుడు ఆర్యన్‌శ్యామ్‌ పోషించనున్నారు. ఈ భారీ బ్రహ్మాండ కథా చిత్రానికి ఆనంద్‌ వి.ప్రసాద్‌ దర్శకత్వం వహించనున్నారు. దీని గురించి యూనిట్‌ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ సుభాష్‌ చంద్రబోస్‌ అసాధారణ జీవిత పయనాన్ని ఆవిష్కరించే ఈ చిత్రానికి సుబాష్‌ అనే పేరును నిర్ణయించినట్లు తెలిపారు.

స్వాతంత్య్ర సమరంలో ఆయన భాగస్వామ్యం, పోరాట లక్ష్యం వంటి విషయాలను విరివిగా పరిశోధించి బలమైన కథనంతో తెరకెక్కిస్తున్న కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. భారత సైనిక దళంలో ( ఐఎన్‌ఏ) కెప్టెన్‌గా బాధ్యతలను నిర్వహించిన సుభాష్‌ చంద్రబోస్‌ విధుల సేవల గురించి, ఆయన జీవితంలో ముఖ్య అధ్యాయాల గురించి, దేశ చరిత్రలో ఆయన ఏర్పరచిన ఉద్రేగం వంటి అంశాలతో తెరకెక్కిస్తున్న కథా చిత్రం ఇది అని చెప్పారు. 

ఈ చిత్రంలో చరిత్ర కారుడైన సుభాష్‌ చంద్రబోస్‌ పాత్రలో నటించనుండటం అరుదైన అవకాశంగా భావిస్తున్నట్లు నటుడు ఆర్యన్‌ శ్యామ్‌ పేర్కొన్నారు. ఈ పాత్రను పోషించడంతో తన బాధ్యత పెరిగిందన్నారు. కాగా బ్రిటీష్‌ పాలనలో భారతీయుల ఆర్ధిక పరిస్ధితులను పెంపొందించడానికి ఇండియన్‌ బ్యాంకును ప్రారంభించిన వీ.కృష్ణస్వామి అయ్యర్‌ మునిమనవడే ఈ ఆర్యన్‌శ్యామ్‌ కావడం గమనార్హం. 

చిత్ర దర్శకుడు ఆనంద్‌ వీ.ప్రసాద్‌ పేర్కొంటూ ఈ తరం యువత చాలా మంది మంచి ఆదాయం చేకూరే టెక్నాలజీని నేర్చుకుని,విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళుతున్నారన్నారు. దీంతో సైనిక రంగంలో యువత కొరత నెలకొందన్నారు. సుభాష్‌ చిత్రం చూసిన తరువాత కనీసం వెయ్యి మంది అయినా సైనికా రంగంలో చేరతారనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రాన్ని తమిళం,తెలుగు, కన్నడం,మలయాళం,హింది అంటూ పలు భాషల్లో రూపొందించబోతున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement