బుర్రా..? కాలిక్యులేటరా? | Aaryan shukla is fastest human calculator and Guinness world record holder | Sakshi
Sakshi News home page

బుర్రా..? కాలిక్యులేటరా?

Oct 6 2026 4:35 AM | Updated on Oct 6 2026 4:35 AM

Aaryan shukla is fastest human calculator and Guinness world record holder

పది పెద్ద లెక్కలు.. కేవలం 28.81సెకన్లు! కాలిక్యులేటర్‌ తీసి బటన్లు నొక్కాల్సిన అవసరం లేదు. కాగితం,  పెన్ను కూడా అక్కర్లేదు. ప్రశ్నను చూస్తాడు.. సమాధానాన్ని మెదడులోనే లెక్కించి చెప్పేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ‘హ్యూమన్‌ కాలిక్యులేటర్‌’గా గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా అతని ఖాతాలో 9 గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు, రెండు మెంటల్‌ కాలిక్యులేషన్‌ వరల్డ్‌ కప్‌ టైటిళ్లు ఉన్నాయి. ఇంతకీ ఎవరతను? అతనే నాసిక్‌కు చెందిన 16 ఏళ్ల ఆర్యన్‌ శుక్లా.

ఆర్యన్  ప్రయాణం ఆరేళ్ల వయసులో మొదలైంది. అప్పుడే మానసిక లెక్కల సాధన ప్రారంభించాడు. ఎనిమిదేళ్లకే అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించాడు. 12 ఏళ్ల వయసులో 2022 మెంటల్‌ కాలిక్యులేషన్‌ వరల్డ్‌ కప్‌ టైటిల్‌ గెలిచాడు. 2024లో మరోసారి విజేతగా నిలిచాడు. అదే ఏడాది డిసెంబరులో గిన్నిస్‌ కార్యక్రమంలో ఒకే రోజులో ఆరు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. వంద నాలుగు అంకెల సంఖ్యలను 30.90 సెకన్లలో, యాభై ఐదు అంకెల సంఖ్యలను 18.71 సెకన్లలో జోడించి చెప్పాడు. 

అలాగే 2026 ఏప్రిల్‌లో ఇటలీలో మరో రెండు రికార్డులు సాధించాడు. ఎనిమిది అంకెల 10 సంఖ్యల స్క్వైర్‌ రూట్స్‌ను 71.22 సెకన్లలో లెక్కించాడు. మరో పరీక్షలో 10 అంకెల సంఖ్యలను 5 అంకెల సంఖ్యలతో భాగించి సమాధానాలు చెప్పడానికి కేవలం 28.81 సెకన్లు తీసుకున్నాడు. ఆర్యన్‌ కుటుంబంలో ఎవరూ మెంటల్‌ మాథ్య్‌లో నిపుణులు కాదు. కాని ఆర్యన్‌ విజయానికి ఏళ్లతరబడి సాధన, ఏకాగ్రతే ప్రధాన కారణం. అదీకాక పోటీలకు సిద్ధమయ్యేటప్పుడు రోజుకు ఐదు నుంచి ఆరు గంటలు సాధన చేస్తాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement