breaking news
Nashik city
-
బుర్రా..? కాలిక్యులేటరా?
పది పెద్ద లెక్కలు.. కేవలం 28.81సెకన్లు! కాలిక్యులేటర్ తీసి బటన్లు నొక్కాల్సిన అవసరం లేదు. కాగితం, పెన్ను కూడా అక్కర్లేదు. ప్రశ్నను చూస్తాడు.. సమాధానాన్ని మెదడులోనే లెక్కించి చెప్పేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ‘హ్యూమన్ కాలిక్యులేటర్’గా గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా అతని ఖాతాలో 9 గిన్నిస్ వరల్డ్ రికార్డులు, రెండు మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్ టైటిళ్లు ఉన్నాయి. ఇంతకీ ఎవరతను? అతనే నాసిక్‌కు చెందిన 16 ఏళ్ల ఆర్యన్ శుక్లా.ఆర్యన్ ప్రయాణం ఆరేళ్ల వయసులో మొదలైంది. అప్పుడే మానసిక లెక్కల సాధన ప్రారంభించాడు. ఎనిమిదేళ్లకే అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించాడు. 12 ఏళ్ల వయసులో 2022 మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్ టైటిల్ గెలిచాడు. 2024లో మరోసారి విజేతగా నిలిచాడు. అదే ఏడాది డిసెంబరులో గిన్నిస్ కార్యక్రమంలో ఒకే రోజులో ఆరు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. వంద నాలుగు అంకెల సంఖ్యలను 30.90 సెకన్లలో, యాభై ఐదు అంకెల సంఖ్యలను 18.71 సెకన్లలో జోడించి చెప్పాడు. అలాగే 2026 ఏప్రిల్‌లో ఇటలీలో మరో రెండు రికార్డులు సాధించాడు. ఎనిమిది అంకెల 10 సంఖ్యల స్క్వైర్ రూట్స్‌ను 71.22 సెకన్లలో లెక్కించాడు. మరో పరీక్షలో 10 అంకెల సంఖ్యలను 5 అంకెల సంఖ్యలతో భాగించి సమాధానాలు చెప్పడానికి కేవలం 28.81 సెకన్లు తీసుకున్నాడు. ఆర్యన్ కుటుంబంలో ఎవరూ మెంటల్ మాథ్య్లో నిపుణులు కాదు. కాని ఆర్యన్ విజయానికి ఏళ్లతరబడి సాధన, ఏకాగ్రతే ప్రధాన కారణం. అదీకాక పోటీలకు సిద్ధమయ్యేటప్పుడు రోజుకు ఐదు నుంచి ఆరు గంటలు సాధన చేస్తాడట. -
నాసిక్ లో కాషాయ జెండా రెపరెపలు
నాసిక్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కషాయ జెండా రెపరెపలాడుతోంది. రాష్టంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుంది. నాసిక్ నగరంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) ను బీజేపీ మట్టకరిపింది. ఎమ్మెన్నెస్ సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. ఇక్కడున్న మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. నాసిక్ సెంట్రల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవయాని పరాండే గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెన్నెస్ అభ్యర్థి వసంత్ గీతెపై 28,272 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. నాసిక్ వెస్ట్ లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీమా మహేష్ హిరాయ్ గెలుపొందారు. మాజీ మేయర్, బీజేపీ అభ్యర్థి బాలాసాహెబ్ సనాప్... నాసిక్ ఈస్ట్ నుంచి విజయం సాధించారు.


