నాసిక్ లో కాషాయ జెండా రెపరెపలు | BJP wrests all three seats from MNS in Nashik city | Sakshi
Sakshi News home page

నాసిక్ లో కాషాయ జెండా రెపరెపలు

Oct 19 2014 3:56 PM | Updated on Mar 29 2019 9:24 PM

నాసిక్ లో కాషాయ జెండా రెపరెపలు - Sakshi

నాసిక్ లో కాషాయ జెండా రెపరెపలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కషాయ జెండా రెపరెపలాడుతోంది. రాష్టంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుంది.

నాసిక్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కషాయ జెండా రెపరెపలాడుతోంది. రాష్టంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుంది. నాసిక్ నగరంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) ను బీజేపీ మట్టకరిపింది. ఎమ్మెన్నెస్ సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. ఇక్కడున్న మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.

నాసిక్ సెంట్రల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవయాని పరాండే గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెన్నెస్ అభ్యర్థి వసంత్ గీతెపై 28,272 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. నాసిక్ వెస్ట్ లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీమా మహేష్ హిరాయ్ గెలుపొందారు. మాజీ మేయర్, బీజేపీ అభ్యర్థి బాలాసాహెబ్ సనాప్... నాసిక్ ఈస్ట్ నుంచి విజయం సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement