రియల్‌మీ నుంచి స్మార్ట్‌ వాచీలు రెడీ | Realme launching two smart watches | Sakshi
Sakshi News home page

రియల్‌మీ నుంచి స్మార్ట్‌ వాచీలు రెడీ

Dec 24 2020 12:40 PM | Updated on Dec 24 2020 1:58 PM

Realme launching two smart watches - Sakshi

ముంబై, సాక్షి: స్మార్ట్‌ ఫోన్స్‌ కంపెనీ రియల్‌ మీ.. స్మార్ట్‌ వాచీలను ప్రవేశపెట్టింది. ఎస్‌ ప్రో, ఎస్‌ బ్రాండ్లతో వీటిని విడుదల చేసింది. సర్క్యులర్‌ డిజైన్‌తోపాటు.. హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌, స్లీప్‌ మానిటరింగ్‌ ఫీచర్స్‌తో రూపొందించింది. కొంత ప్రీమియం మోడల్‌ అయిన ఎస్‌ ప్రో వాచీ ధర రూ. 9,999కాగా.. ఎస్‌ వాచీ ధర రూ. 4,999. వీటికి మధ్యస్థంగా ఎస్‌ మాస్టర్ ఎడిషన్‌ పేరుతో రూ. 5,999 ధరలో మరో మోడల్‌ వాచీని సైతం ప్రవేశపెట్టింది. వీటిని ఈ నెల 29 నుంచీ రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్‌ సైట్లతోపాటు.. స్టోర్లలోనూ విక్రయించనుంది. ఇతర వివరాలు చూద్దాం..(యాపిల్‌ నుంచి తొలిసారి హెడ్‌ఫోన్స్‌)

ఫీచర్స్‌..
సింగిల్‌ బ్లాక్‌ డయల్‌ గల ఎస్‌ ప్రో, ఎస్‌ వాచీలు.. సిలికాన్‌ స్ట్రాప్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. బ్లాక్‌, బ్లూ, ఆరెంజ్‌, గ్రీన్‌ కలర్స్‌లో స్ట్రాప్స్‌ లభించనున్నాయి. వీటితోపాటు.. వేగన్‌ లెదర్‌ స్ట్రాప్స్‌ సైతం బ్లాక్‌, బ్లూ, గ్రీన్‌ కలర్స్‌లో లభిస్తాయి. వీటికి రూ. 499-999 అదనంగా చెల్లించవలసి ఉంటుంది. ఎస్‌ ప్రో వాచీ 1.39 అంగుళాల అమోలెడ్‌ తెరను కలిగి ఉంటుంది. 2.5డి కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌తో లభిస్తుంది. లైట్‌ సెన్సర్‌ ద్వారా బ్రైట్‌నెస్‌లో 5 లెవెల్స్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు. ఏఆర్‌ఎం కార్టెక్స్‌ ఎం4 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆధునిక ఆల్వేస్‌ ఆన్‌డిస్‌ప్లే ఫీచర్‌ను ఓటీఏ అప్‌డేట్‌ ద్వారా తదుపరి దశలో అందించనుంది. రియల్‌మీ లింక్‌ యాప్‌ ద్వారా 100 వాచ్‌ ఫేసెస్ అందుబాటులోకి వస్తాయి. ఔట్‌డోర్, ఇన్‌డోర్‌ రన్‌, వాక్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, బాస్కెట్‌ బాల్, యోగా తదితర 15 రకాల స్పోర్ట్స్‌ మోడ్స్‌ కలిగి ఉంది. 5ఏటీఎం వాటర్‌ రెసిస్టెన్స్‌ను వినియోగించడం ద్వారా స్విమ్మింగ్‌లోనూ యూజ్‌ చేయవచ్చు. రోజంతా హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌తోపాటు.. బ్లడ్‌ ఆక్సిజన్‌ మానిటరింగ్‌, డ్యూయల్‌ శాటిలైట్‌ జీపీఎస్‌ విధానంతో లభిస్తుంది. 420 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మాగ్నిటిక్‌ చార్జింగ్‌ బేస్‌తో రెండు గంటల్లో పూర్తి చార్జింగ్‌కు వీలుంది. (యాపిల్‌ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్‌ కారు!)

ఎస్‌ మోడల్‌ ఇలా
ఎస్‌ వాచీ 1.3 అంగుళాల స్క్రీన్‌తో, 390 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రూపొందింది. 2.5డి కర్వ్‌డ్‌ గొరిల్లా గ్లాస్‌3ను అమర్చారు. రన్నింగ్‌, సైకిల్‌, ఎలిప్టికల్‌, ఫుట్‌బాల్‌, యోగా తదితర 16 స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఉంటాయి. రియల్‌ టైమ్‌ హార్ట్‌రేట్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ లెవల్‌ మానిటరింగ్‌కు ఎస్‌పీవో2 ఫీచర్‌ను కలిగి ఉంది. కనెక్ట్‌ చేసిన ఫోన్‌ నుంచి నోటిఫికేషన్స్‌ అందుకుంటుంది. స్విమ్మింగ్‌కు అనుకూలంకాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement