హైదరాబాద్‌లో భారీ వర్షం.. తమన్‌ లైవ్ కన్సర్ట్ రద్దు | Music Director Thaman OG Tour India Live Concert In Hyderabad Cancelled, Know Reason Inside Post Goes Viral | Sakshi
Sakshi News home page

Thaman: భారీ వర్షం ఎఫెక్ట్.. తమన్‌ లైవ్ కన్సర్ట్ రద్దు

Jun 13 2026 6:33 PM | Updated on Jun 13 2026 7:41 PM

Music director Thaman OG Tour India live concert in Hyderabad cancelled

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక లైవ్ కన్సర్ట్‌ రద్దయింది. భారీ వర్షాల కారణంగా బీజీఎం కింగ్ తమన్ ఆధ్వర్వంలో జరగాల్సిన 'ఓజీ టూర్ ఇండియా' లైవ్ కాన్సర్ట్‌ను రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ రోజు జరగాల్సిన ఈవెంట్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో తమన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

భారీ వర్షంతో వేదిక వద్ద పెద్దఎత్తున నీరు నిలిచి ఉందని నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాకుండా ఈవెంట్‌కు సంబంధించిన సామగ్రి, పరికరాలు కూడా తడిసి ముద్దైపోయాయని తెలిపారు. అందుకే ఈవెంట్‌ను పూర్తిగా రద్దు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మ లైవ్ కాన్సర్ట్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌ హిల్స్‌లో జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్‌ నిర్వహణకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. 
 

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement