మోత మోగిపోద్ది.. | - | Sakshi
Sakshi News home page

మోత మోగిపోద్ది..

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

మాడిఫైడ్‌ సైలెన్సర్లపై పోలీసుల కన్నెర్ర

ఒక్కరోజే 451 కేసులు, రూ.6 లక్షల ఫైన్‌

సాక్షి, సిటీబ్యూరో: ధ్వని కాలుష్య నియంత్రణే లక్ష్యంగా మల్కాజిగిరి ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా... వాహనాలకు మార్పులు చేసిన సైలెన్సర్లను అమర్చి, విపరీతమైన శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కమిషనరేట్‌ పరిధిలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 451 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. 76 వాహనాల నుంచి అనధికారిక సైలెన్సర్లను అక్కడికక్కడే తొలగించారు. ఉల్లంఘనదారులకు రూ.6.14 లక్షల జరిమానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement